ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలో మరోసారి సందడి ఎప్పుడంటే?
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ దర్శకనిర్మాత ఈవీవీ సత్యనారాయణ రూపొందించిన విభిన్న చిత్రం ఆరుగురు పతివ్రతలు రీ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. గతంలో అక్టోబర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాను డిసెంబర్ 11న థియేటర్లలో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈసారి ప్రేక్షకుల ముందుకు ఆరుగురు పతివ్రతలు చిత్రాన్ని సరికొత్త 4K వెర్షన్‌లో తీసుకురావడం విశేషంగా మారింది. అప్పట్లో థియేటర్లలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మళ్లీ ఆ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అవకాశం కలగనుంది. అదే సమయంలో అప్పట్లో పెద్ద తెరపై ఈ చిత్రాన్ని చూడలేకపోయిన నేటి తరం ప్రేక్షకులకు కూడా 4K నాణ్యతతో సినిమాను వీక్షించే అవకాశం లభించనుంది.
విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో దాదాపు నలభై మంది కొత్త నటీనటులను పరిచయం చేయడం అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమృత, లహరి, చలపతిరావు, ఎల్‌బీ శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. వైవాహిక బంధాలు, సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు, హాస్యం మేళవించిన కథాంశంతో ఈ సినిమా రూపొందింది.
విడుదల సమయంలో విభిన్నమైన చర్చలకు దారితీసిన ఆరుగురు పతివ్రతలు కాలక్రమేణా ప్రత్యేకమైన ప్రేక్షకాదరణను సంపాదించుకుంది. రీ రిలీజ్ పోస్టర్‌తో సోషల్ మీడియాలో మళ్లీ ఈ చిత్రం గురించి చర్చ మొదలైంది. డిసెంబర్ 11న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.
Also Read: ఇరాన్‌తో వ్యాపార లావాదేవీల కేసులో హువావీ సంస్థ దోషిగా నిర్ధారణ