BREAKING
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళి ని పరిశీలిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్ విద్యార్థుల పోరాటానికి ప్రకాష్ రాజ్ మద్దతు, సతీమణి భయానికి ఆయన ఇచ్చిన సంచలన సమాధానమిదే! ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించాలి. - ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకోండి పోలీసులు అండగా ఉంటారు. డిఎస్పీ. ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో బాధితురాలికి రూ.లక్ష LOC మంజూరు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.. ఆపన్నహస్తం అందించండి రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 11/1! చీరాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్ జన్మభూమిపై మమకారం.. పెద్ద ఉమెంతాల్ అభివృద్ధికి, క్రీడాకారులు, పేద విద్యార్థుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసిన పట్నం మహేందర్ రెడ్డి భారత్‌కు తొలి షాక్.. ఒక పరుగుకే అభిషేక్ శర్మ అవుట్! కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్టిఐ సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న. చింతలమానేపల్లిలో ఘనంగా కొమురం భీమ్ వర్ధంతి వేడుకలు ఓటు హక్కును వినియోగించుకొన్న ఎస్ ఆర్ సి చైర్మన్ రాజగోపాల్.

ధరలు పెరుగుతున్నా..యూఏఈలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Select Suryaa Now
ధరలు పెరుగుతున్నా..యూఏఈలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

సూర్య అంతర్జాతీయ డెస్క్: అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. నవంబర్ నెలకూ సంబంధించి ఇంధన ధరలను సవరిస్తూ యూఏఈ ఫ్యూయల్ ప్రైస్ కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయంగా క్రూడాయిడ్ ధరలు పెరుగుతున్న ధోరణి కనిపిస్తున్నప్పటికీ, దేశీయంగా మాత్రం పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం వాహనదారులకు పెద్ద ఎత్తున ఉపశమనాన్ని కలిగించింది.

సవరించిన కొత్త ధరల ప్రకారం, సూపర్ 98 పెట్రోల్ లీటర్‌కు గత నెలలో ఉన్న 4.40 దిర్హామ్‌ల నుండి 4.16 దిర్హామ్‌లకు తగ్గింది. అలాగే స్పెషల్ 95 పెట్రోల్ ధర లీటర్‌కు 4.28 దిర్హామ్‌ల నుండి 4.04 దిర్హామ్‌లకు, ఈ-ప్లస్ 91 పెట్రోల్ ధర లీటర్‌కు 4.21 దిర్హామ్‌ల నుండి 3.97 దిర్హామ్‌లకు దిగివచ్చింది. మరోవైపు రవాణా రంగంలో ఎక్కువగా ఉపయోగించే డీజిల్ ధర కూడా స్వల్పంగా తగ్గి లీటర్ 4.80 దిర్హామ్‌ల నుండి 4.75 దిర్హామ్‌లకు చేరింది. ఈ కొత్త ధరలు నవంబర్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.

యూఏఈలో ప్రతి నెలా గ్లోబల్ మార్కెట్ ఇంధన కదలికలకు అనుగుణంగా ధరలను సవరించే విధానాన్ని అనుసరిస్తుంటారు. గత కొన్ని నెలలుగా ప్రాంతీయ ఉద్రిక్తతలు మరియు సరఫరా సవాళ్ల కారణంగా ఇంధన ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. అయితే తాజా సమీక్షలో పెట్రోల్ ధరలు సుమారు 5.6 శాతం వరకు, డీజిల్ ధరలు 1 శాతం పైగా తగ్గాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల సాధారణ ప్రజలపై, ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలు చేసే వాహనదారులపై ఆర్థిక భారం కొంతమేర తగ్గనుంది.