యూనివర్సిటీ స్థాయిలో మూడు బంగారు పతకాలు సాధించిన ఆత్మకూరు విద్యార్థిని
యూనివర్సిటీ స్థాయిలో మూడు బంగారు పథకాలు సాధించిన ఆత్మకూరు విద్యార్థిని
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య :
ఆత్మకూరుకు చెందిన బి. శ్రీ అశ్విత అనే విద్యార్థిని బీఎస్సీ డిగ్రీలో యూనివర్సిటీ స్థాయిలో మూడు బంగారు పథకాలు సాధించి రికార్డు సృష్టించింది. హైదరాబాద్ కు చెందిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో శ్రీ హర్షిత మూడు బంగారు పథకాలను గవర్నర్ శివప్రతాప్ శుక్ల చేతుల మీదుగా స్వీకరించారు. స్థానిక ఉపాధ్యాయుడు బి. శివప్రసాదరావు- లక్ష్మీప్రసన్న దంపతుల కుమార్తె శ్రీఅస్రిత బీఎస్సీ అభ్యశించారు. బిఏ,బీకాం, బీఎస్సీలో అధిక మార్కులు సాధించినందుకు ఒక బంగారు పతకం, బీఎస్సీలో అధిక మార్కులు సాధించినందుకు ఒక బంగారు పతకం, బీఎస్సీ, బీకాం ఉమెన్ కోటాలో అధిక మార్కులు సాధించినందుకు ఒక బంగారు పతకం ఆమె కైవసం చేసుకున్నారు. పరీక్షల్లో అత్యంత ప్రతిభ చూపి యూనివర్సిటీ స్థాయిలో మూడు బంగారు పథకాలు సాధించడం పట్ల తల్లిదండ్రుల శివప్రసాదరావు లక్ష్మీప్రసన్న సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. విద్యార్థిని ఆశ్రిత మూడు బంగారు పతకాలు సాధించడం పట్ల అత్యంత సంతోషం వ్యక్తం చేశారు. బంగారు పతకాలు సాధించడం పట్ల పలువురు ఉపాధ్యాయులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు శ్రీ అస్రితను అభినందించారు.ఆమె భవిష్యత్తులో మరిన్ని బంగారు పతకాలు సాధించి ప్రతిభాశాలి గా నిలవాలని అందరూ ఆకాంక్షించారు.