యలమంచిలి కూటమిలో డిష్యుం డిష్యుం: టీడీపీ, జనసేన వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ!
అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో అధికార కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య తీవ్ర విభేదాలు బయటపడ్డాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా యలమంచిలి 29వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేవలం 13 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.
ఈ స్థానంలో జనసేన అభ్యర్థి ఓటమికి టీడీపీ వర్గమే కారణమని, ఎన్నికల్లో లోపాయికారీగా టీడీపీ నేతలు వైసీపీకి మద్దతు ఇచ్చారని జనసేన కార్యకర్తలు తీవ్రంగా ఆరోపించారు. ఈ క్రమంలోనే జనసేన వర్గం టీడీపీ వర్గంపై దాడులకు దిగడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. క్షేత్రస్థాయిలో స్థానిక నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న వర్గపోరు వీధిన పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.