పట్టణ నడిబొడ్డున పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు…
గత రెండు రోజులుగా వినాయక గంజిలో నిరంతరంగా వెలుగుతున్న వీధి దీపాలు…
అసలే విద్యుత్ కొరత.. దీనికి తోడు ఇలా వృధా…
ఫరూక్ నగర్ రంగారెడ్డి
షాద్ నగర్ పట్టణంలో విద్యుత్ వినియోగం వృధా అవుతుంది సంబంధిత అధికార యంత్రాంగం విద్యుత్ అనవసర వినియోగాన్ని అరికట్టడంలో పూర్తిగా విఫలమవుతుందనడానికి వినాయక గంజిలో పట్టపగలే వెలుగుతున్న విద్యుపాలే ఎందుకు నిదర్శనం వినాయక గంజిలో గత రెండు రోజులుగా నిరంతరంగా వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో చీకట్లో కూడ వెలగని వీధి దీపాలు వినాయక గంజిలో మాత్రం విద్యుత్ వినియోగం వృధా అవుతున్న అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం వైఖరికి నిదర్శనం కనీసం ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నారు సంబంధిత సిబ్బంది విధుల్లో అలసత్వం ప్రదర్శించడం కారణంగానే విద్యుత్ ఆదాలో లోపాలు కనబడుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి కష్టతరంగా మారిన నేపథ్యంలో కొందామన్న విద్యుత్ దొరకడం లేదన్న ప్రభుత్వ ప్రకటనలను సైతం క్షేత్రస్థాయిలో సిబ్బంది బాధ్యతగా వ్యవహరించడం లేదు బాధ్యత లోపాలను కప్పించుకునేందుకు పోటీపడతారు కానీ వృధా అవుతున్న విద్యుత్ ను ఆదా చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తారు . విద్యుత్తు వర్షాభావ పరిస్థితుల ప్రభావాలతో వ్యవసాయ సాగు లో ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు విద్యుత్తు నీటి ఖర్చు తక్కువగా ఉండే పంటలను సాగు చేసేందుకు రైతులను ప్రభుత్వం అధికారం త్రం చైతన్యం చేస్తుంది కేవలం రైతాంగానికైనా ఈ నీటి పాదా వ్యవహారం అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మేల్కొని వ్యవసాయ రంగానికే కాదు అన్ని రంగాల్లో వృధా నీటిని విద్యుత్‌ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సిబ్బంది తమ బాధ్యతను నిర్లక్ష్యం చేయకూడదని కోరుతున్నారు. వెనువెంటనే నిరంతరంగా వెలుగుతున్న విద్యుత్ దీపాలకు ఆన్ ఆఫ్ సిస్టం ని మెరుగుపరచాలని కోరుతున్నారు.