పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ
చౌటుప్పల్: మండల పరిధిలోని మల్కాపురం గ్రామంలో ఆరు నెలల లోపు వయసున్న దూడలకు నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నిరంజన్‌గౌడ్ మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా దూడలకు సకాలంలో నట్టల నివారణ మందులు అందించడం ఎంతో ముఖ్యమన్నారు. పశువులకు వ్యాధులు సోకకుండా పశుపోషకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పశువైద్య సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్సింహ, పాలకవర్గ సభ్యులు, గ్రామ కార్యదర్శి, చౌటుప్పల్ పశువైద్యాధికారి డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.