37వ వార్డులో వైసీపీ అభ్యర్థి బలరాం రావు ఘన విజయం
(అనంతపురం కార్పొరేషన్ మేజర్ న్యూస్..)
అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో 37వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బలరాం రావు విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.వైసీపీ నాయకులు కాకర్ల శ్రీనివాసరెడ్డి, సాకే కుమార్, కిరణ్, బాబీ, రమణ, గాయత్రి, మాజీ కార్పొరేటర్ కమల భూషణ్, లక్ష్మోజి తదితర నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజల సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని బలరాం రావు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.