BREAKING
హాంకాంగ్ లో జాతీయ భద్రతా చట్టం కింద ప్రజాస్వామ్య ఉద్యమకారుడు జోషువా వాంగ్‌కు ఖరారైన శిక్ష ఓపెన్‌ఏఐ పబ్లిక్ ఇష్యూకు సన్నాహాలు...2027 నాటికి ఐపీఓకు సిద్ధమన్న గ్రెగ్ బ్రాక్‌మాన్ వాణిజ్య విధానాలపై డెమొక్రాట్ల పట్టు, ట్రంప్ వీటో అడ్డుగోడ ఇండోనేషియా స్టాక్ మార్కెట్ కీలక సంస్కరణలు అపోలో హాస్పిటల్స్ షేర్లలో స్వల్ప నష్టాలు రెండు వారాల గరిష్టానికి చేరుకున్న బంగారం ధరలు రెండు నెలల కనిష్టానికి పడిపోయిన చమురు ధరలు ప్రభుత్వ భూముల్లో అక్రమణల తొలగింపు దక్షిణ ఆఫ్రికా స్థానిక సంస్థల ఎన్నికలు.. స్వల్ప ఆధిక్యంలో అధికార ఏఎన్‌సీ హరిత ఇంధన మార్పునకు యూఎస్, ఐరోపా సమాజాల మొగ్గు ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభం: తొలి గంటల్లో 4.80 శాతం ఓటింగ్ నమోదు నెం.1 ర్యాంకర్ గా జ్వెరెవ్‌కు మొదటి మ్యాచ్‌లోనే షాక్ వత్సవాయిలో కొనసాగుతున్న పోలింగ్ ఇప్పటివరకు 1,576 ఓట్లు నమోదు.. 3.12 శాతం పోలింగ్ ఫెనెర్‌బాచే చేతిలో లివర్‌పూల్ షాకింగ్ ఓటమి జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తు.

అస్వస్థతకు గురైన విద్యుత్ ఉద్యోగి

Select Suryaa Now
అస్వస్థతకు గురైన విద్యుత్ ఉద్యోగి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతుఫాను విధ్వంసంలో గ్రామానికి వెలుగు నింపేందుకు అహర్నిశలు శ్రమించిన ఓ విద్యుత్ ఉద్యోగి ఒత్తిడికి గురై ఆస్పత్రి పాలయ్యాడు.

వాకలగరువు గ్రామ పంచాయతీ సచివాలయ విద్యుత్ ఉద్యోగి ముత్తాబత్తుల వెంకట్ ఇటీవల వచ్చిన అర్నాబ్ తుఫాను కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలపై వైర్లు తెగిపడటంతో గత వారం రోజులుగా గ్రామంలో రాత్రి పగలు తేడా లేకుండా నిద్ర లేకుండా వర్షంలోనే విధులు నిర్వహించారు. గ్రామ ప్రజలకు నిరంతర విద్యుత్ అందించేందుకు చేసిన కృషిలో తీవ్ర ఒత్తిడికి గురై మంగళవారం బిపి తగ్గిపోవడంతో విధి నిర్వహణలో  కుప్పకూలిపోయారు. వెంటనే తోటి సిబ్బంది, స్థానికులు అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు.విధి నిర్వహణలో అస్వస్థతకు గురైన ఉద్యోగికి ప్రభుత్వం తరపున మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలని గ్రామ ప్రజలు,సహచర ఉద్యోగులు అధికారులను కోరుతున్నారు.