వత్సవాయిలో కొనసాగుతున్న పోలింగ్ ఇప్పటివరకు 1,576 ఓట్లు నమోదు.. 3.12 శాతం పోలింగ్
వత్సవాయి: వత్సవాయి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మండలవ్యాప్తంగా మొత్తం 50,450 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 1,576 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఇప్పటివరకు 3.12 శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్రమంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.