కాటూరులో కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
కాటూరు, మేజర్ న్యూస్: కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో గ్రామస్తులు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు వీల్‌చైర్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు చేపట్టారు.
కాగా, కృష్ణా జిల్లాలో గురువారం ఉదయం 9 గంటల సమయానికి సుమారు 15 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.