BREAKING
నున్న పోలింగ్ కేంద్రంలో మహిళా ఓటర్ల సందడి కాటూరులో కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ షేర్ మొహమ్మద్ పేట లో పోలింగ్ స్టేషన్లు పరిశీలన చేసిన డీసీపీ పదవీ ప్రమాణస్వీకారానికి ముందే..సింగిల్ విండో డైరెక్టర్ పదవికి రాజీనామా యోచనలో కొండల్ రెడ్డి..?* కాలేజీ రోడ్‌లో కోతుల బీభత్సం.. ప్రజలకు తప్పని భయం దాడుల్లో వ్యక్తికి గాయాలు.. నాలుగు కుట్లు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్. డెమొక్రాట్ల మెజారిటీ ప్రదర్శన...ఎన్నికల ఓటమిని అంగీకరించిన డొనాల్డ్ ట్రంప్ 6వ వార్డ్ కౌన్సిలర్ పూల జరీనాకు ఘన సన్మానం ప్రశాంతంగా పోలింగ్. ఫార్ములా వన్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ప్రపంచ ఛాంపియన్ అలన్ జోన్స్ కన్నుమూత పోలింగ్ స్టేషన్ లు పరిశీలించిన ఎం ఆర్ ఓ డాబర్ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు: బ్రోకరేజీ సంస్థల భిన్న వైఖరులు, లక్ష్య ధరల సవరణ ఎన్టీఆర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభం స్టాక్ మార్కెట్లలో బుల్స్ జోరు: భారీ లాభాలతో ప్రారంభానికి గిఫ్ట్ నిఫ్టీ బలమైన సంకేతాలు ఏషియన్ పారా గేమ్స్ 2026 విజేతలతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక సమావేశం

షేర్ మొహమ్మద్ పేట లో పోలింగ్ స్టేషన్లు పరిశీలన చేసిన డీసీపీ

Select Suryaa Now
షేర్ మొహమ్మద్ పేట లో పోలింగ్ స్టేషన్లు పరిశీలన చేసిన డీసీపీ

షేర్ మొహమ్మద్ పేటలో పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన డీసీపీ బి. సత్యనారాయణ

జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 5:

ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జగ్గయ్యపేట మండలం షేర్ మొహమ్మద్ పేట గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లను డీసీపీ బి. సత్యనారాయణ గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ఏర్పాట్లు, భద్రతా పరిస్థితులను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.

ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించినట్లు తెలిపారు.

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపడుతోందని ఈ పర్యటన ద్వారా స్పష్టం చేశారు

 

 

 

రిపోర్టర్ :-శివారెడ్డి జగ్గయ్యపేట రూరల్ ఎన్టీఆర్ జిల్లా