జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తు.
జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తు. పెడన, మేజర్ న్యూస్ : పరిషత్ ఎన్నికల నేపథ్యంలో పెడన మండలంలో రెండు అత్యంత సమస్య యత్మక గ్రామాలుగా ఏడు సమస్య ఆత్మక గ్రామాలలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. వీటిలో అత్యంత సమస్య ఆత్మక గ్రామాలు లంకల కలవగుంట, కొంకేపూడి గాను, సమస్య ఆత్మక గ్రామాలుగా నందమూరు నందిగామ పుల్లపాడు బల్లిపర్రు కాకర్లమూడి కాకర్లమూడి పాలెం ఈదుముడి గురివిందగుంట కోటవాని పాలెం గా గుర్తించారు. ఈ గ్రామాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మండలంలో మొత్తం పది ఎంపీటీసీ సెగ్మెంట్లు ఒక జడ్పిటిసి సెగ్మెంట్ ఉన్నాయి. మొత్తం 27,946 ఓటర్లు ఉన్నారు. 10 సెగ్మెంట్లలో 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల అనంతరం వాలెట్ బాక్సులను మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీ కి తరలించి లెక్కింపు అక్కడే జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.