BREAKING
పోక్సో చట్టంపై న్యాయ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ శ్రీ సంజీవ స్వామి ఆలయ నిర్వహణ హక్కులపై వివాదం.. పార్థసారథి పిటిషన్‌పై మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి అభ్యంతరం మాచర్ల : అభివృద్ధి చూసి ఓటు వేయండి. ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు అభివృద్దే మా అభిమతం, ఎజెండా.. సీనియర్ మైనారిటీ నాయకులు బీడీ మస్తాన్ సహా పలువురు టీడీపీలో చేరిక సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే అమిలినేని. పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమష్టిగా కృషి చేయాలి గొట్టల గడ్డ తాండలో హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవానికి పట్నం మహేందర్ రెడ్డి కి ఆహ్వానం అంబులెన్స్‌లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి.. చాకచక్యంగా ప్రసవం చేసిన 108 సిబ్బంది పట్టణ సమగ్ర అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతివ్వాలి - ఎమ్మెల్యే ముత్తుముల తుఫాన్‌కు కూలిన చెట్టు తొలగింపు కలెక్టర్ దీపక్ తివారి అధ్యక్షతన జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం *​ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఒంగోలులోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ.వి.హర్షవర్ధన్ రాజు

వ్యాదులు ప్రబలకుండా ముందస్తు చర్యలు

Select Suryaa Now
వ్యాదులు ప్రబలకుండా ముందస్తు చర్యలు

పాలకొండ, సూర్య : తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు కారణంగా ఎక్కడా వ్యాదులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా అసంక్రమిత వ్యాదుల నియంత్రణ అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. ఈ సందర్భంగా గురువారం వీరఘట్టం పిహెచ్సీ , జె. గోపాలపురం గ్రామం లను ఆయన సందర్శించారు. ఆసుపత్రి  ఓపి లో నమోదు అయిన ఆరోగ్య వివరాలు, గ్రామాల్లో ఆరోగ్య సమాచారం  తెలుసుకున్నారు. వైద్య శిబిరం పరిశీలించారు. వర్షాలు కారణంగా ఇళ్ళ పరిసరాలు, వీధులలో నీటి నిల్వలు గుర్తించి అందరి సమన్వయంతో వాటిని తొలగించుకోవాలని లేకపోతే దోమలకు ఆవాసాలుగా మారి జ్వరాలు ప్రబలడానికి ఆస్కారం ఉంటుందని, అలగే ఆహారం, త్రాగు నీరు కలుషితం కాకుండా జాగ్రత్త పడాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగడానికి వినియోగించాలని సూచించారు. అంగన్వాడీ, పాఠశాలను సందర్శించి పిల్లల ఆరోగ్య వివరాలు తెలుసుకొని సిబ్బందికి సూచనలు చేశారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, మందులు, వైద్య పరీక్షలు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. జిల్లా అధికార యంత్రాంగం సూచనలను ప్రజారోగ్యమే ద్యేయంగా ఎప్పటికప్పుడు అమలు చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా డి. ప్రదీప్ కుమార్, డా ఎమ్. సాయి కుమార్, డెమో గిరిబాబు, వైద్య సిబ్బంది ఉన్నారు.