విశ్వంలో వీఎల్ఎస్ఐ ఫిజికల్ డిజైన్ అంశంపై గెస్ట్ లెక్చర్
- ఆకట్టుకున్న ఎన్ఐటి ప్రొఫెసర్ ప్రసంగం
మదనపల్లె : మదనపల్లెలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల (అటానమస్)లో బీ.టెక్ ఈసీఈ విద్యార్థుల కోసం వీఎల్ఎస్ఐ టెక్నాలజీలో ఫిజికల్ డిజైన్ లో సవాళ్లు మరియు ఆవిష్కరణలు అనే అంశంపై ఒక రోజు గెస్ట్ లెక్చర్ ను విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా తమిళనాడులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి),తిరుచిరాపల్లి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.చంద్రబాబు నాయక్ హాజరై విజ్ఞానవంతమైన ప్రసంగం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సెమీకండక్టర్ పరిశ్రమలో మెషిన్ లెర్నింగ్,వీఎల్ఎస్ఐ డిజైన్ ఆటోమేషన్,ఆర్టిఎల్ నుండి జిడిఎస్ఐఐ వరకు డిజైన్ ఫ్లో యొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఫిజికల్ డిజైన్ అంటే ఏమిటి లాజికల్ నెట్ లిస్ట్ ను ఫిజికల్ లేఅవుట్ గా మార్చే అత్యంత కీలకమైన దశ అని,యాపిల్ ఎ18 చిప్ లో 100 ఎంఎం²లో 20 బిలియన్ ట్రాన్సిస్టర్లు ఉండటం దీనికి నిదర్శనమని తెలిపారు.
ప్రధాన సవాళ్లు
టెక్నాలజీ స్కేలింగ్ - ఇంటర్ కనెక్ట్ డిలే,ప్రాసెస్ వేరియేషన్,డిఆర్సి రూల్స్ (180 ఎన్ఎంలో 500 ఉంటే 3ఎన్ఎంలో 10,000 కు పైగా),పవర్ సవాళ్లు - పవర్ డెన్సిటీ,ఐఆర్ డ్రాప్,లీకేజీ పవర్,టైమింగ్ సవాళ్లు - టైమింగ్ క్లోజర్,క్లాక్ స్క్యూ, సిగ్నల్ ఇంటిగ్రిటీ.తాజా ఆవిష్కరణలు : ట్రాన్సిస్టర్ టెక్నాలజీ ప్లానార్ నుండి ఫిన్ ఫెట్,జిఎఎ నానోషీట్ (3ఎన్ఎం/2ఎన్ఎం) మరియు భవిష్యత్తులో సిఎఫ్ఈటీ.డిజైన్ విధానం: ఏఐ ఆధారిత ఫిజికల్ డిజైన్ (సైనసైస్ హెచ్ టిటిపి://డిఎస్ఓ.ఏఐ),3డి- ఐసి మరియు చిప్లెట్ డిజైన్,షిఫ్ట్-లెఫ్ట్ మెథడాలజీ.మెటీరియల్స్ : కాపర్ స్థానంలో కోబాల్ట్,రుథీనియం మరియు ఇయువి లితోగ్రఫీ.అలాగే వీఎల్ఎస్ఐ రంగంలో 8-15 ఎల్.పి.ఎ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి,డైరెక్టర్ మిస్ ఎం.నందితా రెడ్డి,ప్రిన్సిపాల్ డాక్టర్ బి.డి.వెంకటరమణా రెడ్డి,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సుబ్బారెడ్డి,ఈసీఈ హెచ్.ఓ.డి డా.బి.సురేష్ బాబు,కో-ఆర్డినేటర్లు బి.కీర్తి,టి.హుస్సేనీ తదితరులు పాల్గొన్నారు.
కె ఈశ్వర్ రెడ్డి మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జ్