విజయవాడలో ఉద్రిక్తత.. సచివాలయ ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు
విజయవాడ గాంధీనగర్ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చౌక్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన గ్రామ సచివాలయ ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఉద్యోగుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదని ఉద్యోగులు పేర్కొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నించారు.