BREAKING
13 వ డివిజన్ కార్పొరేటర్ గా కొట్టే రుక్మిణమ్మ ఏకగ్రీవం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026

విజయలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారి దర్శనం

Select Suryaa Now
విజయలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారి దర్శనం

నెల్లూరు కల్చరల్/రాపూరు మేజర్ న్యూస్ 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో ఆదిలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకారాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఉదయం వేళ ఆలయంలో అమ్మవారికి నయనానందకరంగా ప్రత్యేక పుష్పాలంకరణ చేపట్టారు. అనంతరం ఉదయం ప్రధానార్చకులు, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి విశేషంగా స్నపన తిరుమంజనం మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు.
సాయంత్రం అమ్మవారికి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరణ చేశారు. సాయంత్రం ఆదిలక్ష్మి అమ్మవారు విశేష "శ్రీ విజయలక్ష్మి" అలంకారంలో పద్మపీఠంపై కొలువుదీరి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ప్రాకారోత్సవం అత్యంత వైభవోపేతంగా సాగింది. ఉత్సవం అనంతరం మహిళా భక్తుల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ వేడుకలకు సంబంధించిన వివరాలను ఆలయ ఉప కమిషనరు, కార్యనిర్వాహణాధికారి జనార్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.