BREAKING
ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ బొబ్బిలి మాజీఎమ్మెల్యే. .చంబంగివెంకట చిన్నప్ప నాయుడు పోలింగ్ లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలి : జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్..* శ్రీధర్ గాదె కొత్త సినిమా 'కొరివి' టైటిల్ గ్లింప్స్ విడుదల: ఈశ్వర్ రాచిరాజు హీరోగా విలేజ్ బ్యాక్ డ్రాప్ హారర్ మూవీ కన్నడ నటి రన్యారావుకు వీఐపీ ప్రొటోకాల్ దర‍్శనం: తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు క్రైస్తవ సమాజంలో సంస్కరణలు రావాలి - పల్లె శాంతిరాజ్ లక్ష ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న చలమల్ల కృష్ణారెడ్డి పేదల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నది కూటమి ప్రభుత్వమే. అట్టహాసంగా ముగిసిన 'మోహన మంత్ర'! విద్యార్థుల మేధస్సుకు పట్టం కట్టిన టెక్నో-కల్చరల్ ఫెస్ట్. అంగన్‌వాడి కేంద్రంలో పాము కలకలం.. కరువు మండలాలుగా ప్రకటించాలని కలెక్టర్ కు వినతి - మాజీ ఎమ్మెల్యే గడ్డి గారి విట్టల్ రెడ్డి. ### పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్న వారిని బర్తరఫ్ చేయాలి జనసేన మండల అధ్యక్షుడు అడపా నాగరాజుపై పార్టీ నాయకుల తీవ్ర ఆరోపణలు బొర్రంపాలెం సమావేశంలో పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ బంగ్లాదేశ్‌లో విజృంభిస్తోన్న డెంగ్యూ మహమ్మారి టిజిపిసిబిలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు తైపీ మేయర్‌కు ఘోర అవమానం.. ప్రైడ్ పరేడ్‌లో నిరసనల హోరు మళ్లీ ఆదరిస్తే శంబర మరింత అభివృద్ధి

విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, ఎంపీ హరీశ్

Select Suryaa Now
విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, ఎంపీ హరీశ్

అమలాపురం, మేజర్‌న్యూస్‌ :

 అర్నబ్ తుఫాన్ కారణంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, అమలాపురం ఎంపీ హరీశ్ బాలయోగి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

శనివారం అమలాపురంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను ఎంపీ హరీశ్ బాలయోగితో కలిసి రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు పరిశీలించారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి, వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరమ్మతు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

తుఫాన్ కారణంగా విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం అందుబాటులో ఉండాలని ఎంపీ సానా సతీష్ బాబు సూచించారు. ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, ప్రజల సాధారణ జీవన పరిస్థితులను వీలైనంత త్వరగా మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం నిరంతరం శ్రమిస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది సేవలను ఎంపీ సానా సతీష్ బాబు ప్రత్యేకంగా అభినందించారు.