విద్యార్థులు సరైన ప్రణాళికతో ఉద్యోగాలకు సిద్ధం కావాలి
- మిట్స్‌లో ఉద్యోగ సన్నద్ధతపై అతిథి ఉపన్యాసం
మదనపల్లె : మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు కాలేజీ నుంచి కార్పొరేట్‌కు అనే అంశంపై ఉద్యోగ మరియు కెరీర్ ఆపర్చునిటీలపై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిట్స్ పూర్వ విద్యార్థి మరియు బెంగళూరుకు చెందిన యాక్సెంచర్ సంస్థలో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న బి.జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పరిశ్రమ అవసరాలు,ఉద్యోగ అవకాశాలు,ప్లేస్‌మెంట్‌కు సిద్ధమయ్యే విధానంపై విలువైన సూచనలు అందించారు.కళాశాల విద్య నుంచి కార్పొరేట్ రంగంలోకి మారే క్రమంలో విద్యార్థులు మూడో సంవత్సరం నుంచే ప్లేస్‌మెంట్‌కు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలన్నారు.ప్రేరణ,అవగాహన,సన్నద్ధత,గుర్తింపు అనే నాలుగు ప్రధాన అంశాల ఆధారంగా విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.విద్యార్థులు తమ ప్రస్తుత నైపుణ్యాలను అంచనా వేసుకుని,లోపాలను గుర్తించి వాటిని అధిగమించేందుకు కృషి చేయాలన్నారు.ముఖ్యంగా పైథాన్,ఎస్.క్యూ.ఎల్,డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్,డేటా సైన్స్ వంటి ప్రాథమిక మరియు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలపై పట్టు సాధించాలన్నారు.డేటా అనలిటిక్స్,డేటా సైన్స్,డేటా ఇంజినీరింగ్,సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్,బిజినెస్ ఇంటెలిజెన్స్,క్లౌడ్ మరియు డేటా సంబంధిత విభాగాల్లో ఉన్న వివిధ కెరీర్ అవకాశాలను వివరించారు.విద్యార్థులు నేర్చుకున్న సాంకేతిక నైపుణ్యాలను ఆచరణాత్మక ప్రాజెక్టుల రూపంలో ప్రదర్శించాలని,తమ ప్రతిభను రెజ్యూమ్,లింక్డ్‌ఇన్,గిట్‌హబ్ వంటి వేదికల ద్వారా ప్రొఫెషనల్‌గా ప్రదర్శించుకోవాలన్నారు.కేవలం ఒక నైపుణ్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కాకుండా,దానిని ఆచరణలో పెట్టడం,తమ ప్రతిభను ప్రాజెక్టుల ద్వారా నిరూపించడం,ఇంటర్వ్యూలో సమర్థవంతంగా వివరించడం ద్వారా ఉద్యోగ అవకాశాలను పొందవచ్చని తెలిపారు.విద్యార్థుల కోసం 300 రోజుల ప్లేస్‌మెంట్ రోడ్‌మ్యాప్,అభ్యసించాల్సిన వివిధ వనరులు,అలాగే మొదటి ఏడు రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను వివరించారు.విద్యార్థులు తమ విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా ప్రతిరోజూ క్రమబద్ధంగా ప్లేస్‌మెంట్ సన్నద్ధతకు సమయం కేటాయించాలన్నారు.ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ కుసుమ,అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.గుత్తి నాగాశ్వేత,కో-ఆర్డినేటర్,జి కిరణ్ కుమార్,విద్యార్థులు పాల్గొన్నారు.
కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి