విద్యార్థులకు బాలల దినోత్సవ కానుక
వింజమూరు, మేజర్ న్యూస్ : ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉన్న చెరుకూరు వెంకటేశ్వర్లు తన సొంత గ్రామం గుండె మడకల నందు గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల గుండెమడకల మెయిన్ విద్యార్థుల కోసం బాలల దినోత్సవం రోజున కానుకగా పిల్లలందరికీ బహుమతుల కోసం రూ.3000లు రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ నగదు తో విద్యార్థులందరికీ ఎగ్జామ్ పాడ్స్, పెన్సిల్స్, షార్ఫ్నర్, స్కేలు, మధ్యాహ్న భోజనం నందు స్వీట్స్ మరియు అరటి పళ్ళు అందజేసినారు. ఈ కార్యక్రమం నందు ఎస్ఎంసి చైర్మన్ మందా ప్రసాద్ రెడ్డి వైస్ చైర్మన్ వేములపాటి మహేశ్వరి , ఎస్ఎంసి సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై పరమేశ్వర రావు మరియు గుండె మడకల బీసీ ఉపాధ్యాయులు సుందరయ్య విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు