andhrapradesh
వేల్పూరు నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పీ శేషాద్రి
పల్నాడు జిల్లా న్యూస్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వినుకొండ శావల్యాపురం మండలం వేల్పూరులోని నామినేషన్ కేంద్రాలను పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) ఎల్. శేషాద్రి పరిశీలించారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా డ్రోన్, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, పోలీసు సిబ్బంది బాడీ వార్న్ కెమెరాలు ధరించాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో బారికేడ్లు ఏర్పాటు చేసి, అనధికార వ్యక్తులు, వాహనాలను అనుమతించరాదని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ రూరల్ సీఐ బ్రహ్మయ్య, శావల్యాపురం ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.