వెల్దుర్తిపాడులో యర్రగడ్డ రాజు ఇంటి వద్ద ఘనంగా అయ్యప్ప పూజలు
వెల్దుర్తిపాడులో యర్రగడ్డ రాజు ఇంటి వద్ద ఘనంగా అయ్యప్ప పూజలు
పెనుగంచిప్రోలు మేజర్ న్యూస్ :
పెనుగంచిప్రోలు మండలంలోని వెల్దుర్తిపాడు గ్రామంలో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మాలలు ధరించిన స్వాములు గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అయ్యప్ప భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.గ్రామానికి చెందిన యర్రగడ్డ రాజు ఇంటి వద్ద అయ్యప్ప భజన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. స్వాములు అయ్యప్ప నామస్మరణ, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. అనంతరం అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు స్వామివారిని దర్శించుకునారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలో అయ్యప్ప నామస్మరణతో భక్తి వాతావరణం నెలకొంది.