BREAKING
ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకోండి పోలీసులు అండగా ఉంటారు. డిఎస్పీ. ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో బాధితురాలికి రూ.లక్ష LOC మంజూరు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.. ఆపన్నహస్తం అందించండి రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 11/1! చీరాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్ జన్మభూమిపై మమకారం.. పెద్ద ఉమెంతాల్ అభివృద్ధికి, క్రీడాకారులు, పేద విద్యార్థుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసిన పట్నం మహేందర్ రెడ్డి భారత్‌కు తొలి షాక్.. ఒక పరుగుకే అభిషేక్ శర్మ అవుట్! కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్టిఐ సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న. చింతలమానేపల్లిలో ఘనంగా కొమురం భీమ్ వర్ధంతి వేడుకలు ఓటు హక్కును వినియోగించుకొన్న ఎస్ ఆర్ సి చైర్మన్ రాజగోపాల్. సూర్య స్పోర్ట్స్ డెస్క్: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఐదో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్! ఓటు హక్కు వినియోగించుకున్న ఎస్సార్సీ చైర్మన్ రాజగోపాల్, మహీధర్ రెడ్డి పట్టభద్రుల ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి: నీరుడు పవన్ సాయి ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు

వెల్దుర్తి గ్రామ ప్రజలు శ్రమించి బొమ్మన రవి రెడ్డి విజయానికి కృషి చేయాలి ....

Select Suryaa Now
వెల్దుర్తి గ్రామ ప్రజలు శ్రమించి బొమ్మన రవి రెడ్డి విజయానికి కృషి చేయాలి ....

వెల్దుర్తి గ్రామ ప్రజలు శ్రమించి బొమ్మన రవి రెడ్డి విజయానికి కృషి చేయాలి .…

వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్: స్థానిక వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ వైకాపా సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన రవీంద్రనాథ్‌రెడ్డి విజయానికి గ్రామ ప్రజలందరూ సహకరించాలన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఎంపికను ఏకగ్రీవంగా ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.స్థానికంగా నిర్వహించిన ఈ సమావేశానికి 16 వార్డులకు చెందిన నాయకులు, వైకాపా శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులు సభాముఖంగా మాట్లాడుతూ... గ్రామాభివృద్ధిని కాంక్షించే బొమ్మన రవీంద్రనాథ్‌రెడ్డిని సర్పంచ్‌గా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 16 వార్డులకు చెందిన కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ, ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసే రవీంద్రనాథ్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి వెల్దుర్తి పంచాయతీపై వైకాపా జెండా ఎగురవేస్తామని వైకాపా పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు .ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు, 16 వార్డుల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు... సూర్య ప్రతినిధి కే రాజశేఖర్ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం