BREAKING
కర్ణాటకలో ఎస్ఐఆర్ రగడ, ఫారం-7 దరఖాస్తులపై కార్యకర్తలపై నమోదైన ఎఫ్ఐఆర్‌లు ఉపసంహరించాలని డీజీపీని కోరిన బీజేపీ జన్మదిన వేడుకలను జయప్రదం చేయండి మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలి మిట్నాల గ్రామంలో విషాదం -వైసిపి నాయకులు తిరుపతిరెడ్డి సోదరి మహాలక్ష్మి మృతి ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం: ఫైనల్లో పాకిస్తాన్‌పై 19 పరుగుల తేడాతో ఘన విజయం ఎమ్మెల్సీ ఓటే ఆయుధం....పేర్లు నమోదు చేసుకోండి 81 లక్షలతో తరగతి గదులు ప్రారంభం TWU &SWF ఐక్య కూటమి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ డిపో ముందు ప్రచార జాతా నిరంతరం రక్తదాన సేవలు అభినందనీయం: మాజీ ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి నగరంలోని పార్క్ ల్లో చేస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి* జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సిబ్బంది అలసత్వం మట్టి దొంగలకు వరం..:*అక్రమార్కులకు కాసులు పండిస్తున్న మేఘా సంస్థ సిబ్బంది నిర్వాకం గ్రామ గ్రామాన వి బి జి రాంజీ గ్రామసభలు అనంతగిరి బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం భారత వీరుడు, మన జాతి హీరో స్మిత్ మచ్చర్ వేగంగా కోలుకోవాలి

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి. **డిమాండ్ల సాధన కోసం సహాయ నిరాకరణ ఉద్యమం.

Select Suryaa Now
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి.  **డిమాండ్ల సాధన కోసం సహాయ నిరాకరణ ఉద్యమం.

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి.

**డిమాండ్ల సాధన కోసం సహాయ నిరాకరణ ఉద్యమం.

చిన్నగొట్టిగల్లు, అక్టోబర్ 03, మేజర్ న్యూస్:

వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని చిన్నగొట్టిగల్లు మండల అధ్యక్షులు రమణయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ ఉద్యమం, సమ్మె చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. తెలంగాణ తరహాలో వీఆర్ఏలకు పేస్కేలు అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ వీఆర్ఏలుగా నియమించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే అర్హత కలిగిన వీఆర్ఏలందరికీ ప్రమోషన్లు కల్పించాలని, వయస్సుతో సంబంధం లేకుండా విధి నిర్వహణలో మరణించిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు కల్పించాలని కోరారు.

వీఆర్ఏలపై మోపుతున్న అక్రమ డ్యూటీలను తక్షణమే రద్దు చేయాలని, తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం చిన్నగొట్టిగల్లు మండల అధ్యక్షులు రమణయ్య, ఉపాధ్యక్షులు వెంకట్రామయ్య, శ్రావణ్, ప్రేమకుమార్, రెడ్డి రాణి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.