వసతి గృహాలలో మెరుగైన సదుపాయాల కల్పనకు చర్యలు
- ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా వెల్లడి
మదనపల్లె : పట్టణంలోని నీరుగట్టువారిపల్లి నందు గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని కుటుంబ పార్టీల నేతలతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు.రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి హాస్టల్ భవనం ఉరవడంతో విద్యార్థులు రాత్రి నిద్రలేకుండా వర్షం నీటిలో తడుస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో చూసినట్లు,ఎదుర్కొన్న సమస్యలను హాస్టల్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.హాస్టల్ వార్డెన్,సిబ్బందిని విచారించారు.హాస్టల్లో అందుతున్న సౌకర్యాలను విద్యార్థులను అడిగి తెలుసుకుని,విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు చేపట్టే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఉరుస్తున్న హాస్టల్ భవనాన్ని వెంటనే హాస్టల్ భవనానికి మరమ్మతులు చేసి రంగులు వేయించాల్సిందిగా ఆదేశించారు.మధ్యాహ్న భోజనం బాగుందా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను దృష్టిలో పెట్టుకొని నేడు హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని,రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు తడుస్తూ విద్యార్థులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తను దృష్టికి రావడంతో చాలా బాధ కలిగించిందని,వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యార్థులకు మెరుగైన వసతి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించడం జరిగిందని,హాస్టల్ అద్దె భవనంలో ఉందని,నూతన భవన నిర్మాణం కోసం చర్యలు తీసుకోనున్నట్లు విద్యార్థులకు ఎమ్మెల్యే హామీఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు తెలుగుదేశం నాయకులు రామిశెట్టి కృష్ణ (కమలామర్రి),రామిశెట్టి నీలకంఠ,రాటకొండ శ్రీనివాసులు నాయుడు,బీదం గురునాథ్ యాదవ్,రామిశెట్టి రత్నమయ్య,నవీన్ చౌదరి,రామిశెట్టి రెడ్డి కేశవ,ఆదిల్,రమేష్ రెడ్డి,మంజునాథ్,జాఫరున్నీషా తదితరులు పాల్గొన్నారు.
కె. ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి