BREAKING
ఘనంగా విజయదశమి వేడుకలు రేపల్లె జెడ్పీటీసీ బరిలో బీజేపీ అభ్యర్థి జుజ్జవరపు సురేష్‌ ఆత్మకూరులో పోలీస్ కవాతు అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి.. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఒకే కుటుంబంలో 26 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు.. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు హక్కు పొందాలి: బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభ ప్రద్ పటేల్ ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు భారీ పోలీస్ బందోబస్తు ప్రధాని మోదీ సమక్షంలో కళా ప్రదర్శనకు అవకాశం బాపట్లలో ‘ఫ్రెండ్లీ ఎలక్షన్స్‌’పై జనసేన దృష్టి! ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి సీఏఆర్‌లో మెగా రక్తదాన శిబిరం.. స్వయంగా రక్తదానం చేసిన సీపీ బి. సుమతి దలేర్ మెహందీకి మద్దతుగా నిలిచిన అనుపమ్ ఖేర్.. వేదికపై గాయకుడిని పబ్లిక్‌గా నిలదీయడం తగదంటూ వ్యాఖ్యలు! మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అభ్యర్థుల జాబితా ప్రకటన ఈనెల 25 వరకు వాయిదా! తాళ్లపేటలో దాడి.. ముగ్గురికి గాయాలు నంద్యాల మునిసిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా డాక్టర్ బాబన్ కు బీ-ఫామ్ అందజేసిన మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ 2 ముగింపు.. 450 ఎపిసోడ్ల తర్వాత భావోద్వేగంగా వీడ్కోలు పలికిన ఏక్తా కపూర్!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేసింది. ---- బళ్ళ జ్ఞాన లింగ జ్యోత్స్న రాణి వెల్లడించారు.

Select Suryaa Now
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేసింది.                  ---- బళ్ళ జ్ఞాన లింగ జ్యోత్స్న రాణి వెల్లడించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేసింది.                  ---- బళ్ళ జ్ఞాన లింగ జ్యోత్స్న రాణి వెల్లడించారు.                  


పెడన మేజర్ న్యూస్ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు తీరని ద్రోహం చేసిందని అందుకే పార్టీ మారి జనసేన తరపున గ్లాస్ గుర్తుపై  మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేయవలసి వచ్చిందని పురపాలక సంఘ కూటమి ప్రభుత్వ చైర్పర్సన్ అభ్యర్థి బళ్ళ  జ్ఞాన లింగ జోష్నారాణి తెలిపారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వ నాయకులతో బొడ్డు వేణుగోపాలరావు నివాసం వద్ద పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా బొడ్డు వేణు మాట్లాడుతూ  మీ అందరికీ తెలుసు, పెడనపట్నంలో జోష్నా రాణి  ఎంపిక ఒక సెన్సేషనల్ నిర్ణయం అనేటువంటిదిఅని చెబుతూ పెడన పురపాలక సంఘం అంటే తెలుగుదేశం పార్టీ,తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చైర్ పర్సన్ గా ఉంటారని అందరూ ఆశించారని తెలిపారు. అయితే అనూహ్యంగా పెడన సీటు జనసేన పార్టీకి కేటాయించడం. ఆ జనసేన పార్టీ కేటాయించిన సందర్భాల్లో జనసేన పార్టీ నాయకులు పెడన పట్నంలో అందరి దగ్గరికి వెళ్లి, ప్రముఖులందరినీ కూడా కలిసి ఆ పార్టీ యొక్క ఆహ్వానించడం జరిగింది అని పేర్కొన్నారు.  తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ జనసేన పార్టీకి కేటాయించినప్పటికీ, ఎక్కడా కూడా ఈసoమoత ఎత్తు కూడా అసంతృప్తి లేదనేటువంటి విషయాన్ని గమనించాలన్నారు. మేము సంపూర్ణంగా మా నాయకులు చంద్రబాబు నాయుడు , మా నాయకులు పవన్ కళ్యాణ్  ఆదేశాలు ఎలా ఉన్నాయో దాన్ని మేము ఇక్కడ తూచా తప్పనిసరిగా మా అధిష్టాన వర్గం యొక్క నిర్ణయాలు ఏదైతే ఉందో, కూటమి ధర్మం ఏదైతే ఉందో దానినే పాటిస్తాం అని స్పష్టం చేశారు .   అదేవిధంగా జనసేన పార్టీ తరపున ముందుగా మీడియాలో మట్ట శివపావన పేరు  పేరు రావడం జరిగిందిఅని ఆ తర్వాత కొన్ని విషయాలు పవన్ కళ్యాణ్  దృష్టికి ఇక్కడున్నటువంటి పరిస్థితులు, ఇక్కడున్నటువంటి సామాజిక సమీకరణలు, సోషల్ ఇంజనీరింగ్ విధానాలు అన్నిటిని కూడా వారి దృష్టికి తీసుకెళ్తే, ఎంత గొప్పగా ఆయన ఆలోచించారన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సామాజిక దృష్టి పెట్టుకుని చేనేత వర్గాల వాళ్ళకి ఇవ్వాలి, అది న్యాయం అనేటువంటి ఉద్దేశంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మార్పు చేసుకోవడం  అది చాలా గొప్ప విషయం అని చెప్పారు. ఈనెల  28 పోలింగ్ అనంతరం విజయం తద్యం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తున్నానన్నారు .  ఏదైతే చేనేత కలంకారి కోసం ఎమ్మెల్యే కృషి చేస్తా ఉంటే, ఎంపీ  కృషి చేస్తా ఉంటే దాన్ని అడ్డుకున్నారో, అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం హిందూ స్మశాన వాటిక మీ అందరికీ తెలుసు, హిందూ స్మశాన వాటికలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయం హిందూ స్మశాన వాటికకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు వైసపి పార్టీకి సంబంధించిన నాయకులు ఏం మాట్లాడారో మీడియా ముఖంగా మీరందరికీ తెలుసు అన్నారు.  ఇవాళ దాదాపుగా 90% పహరి గోడ నిర్మాణం జరిగింది అని చెబుతూ అయితే ఈ హిందూ స్మశాన వాటిక ఎవరి ఆధ్వర్యంలో పూర్తవుతుందో వాళ్ళని మీరు ఆశీర్వదించండి అని కోరారు. కూటమి ప్రభుత్వ చైర్పర్సన్ మరియు వార్డు కౌన్సిల్ అభ్యర్థులకు అఖండ విజయం చేకూర్చాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎక్కల శ్యామలరావు, బళ్ళ  ప్రసాదు చందన నారాయణరావు, పులబాబు, హన్ను, ఎర్ర రాజా తదితరులు ఉన్నారు.