ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. శాంతిభద్రతల సమస్యలతో నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థుల ఫిర్యాదులను పరిశీలించి, గడువు పొడిగింపుపై అక్టోబర్ 22లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. గడువు పొడిగిస్తే కనీసం 48 గంటల సమయం ఇవ్వాలని, అభ్యర్థులకు పోలీసు భద్రతతో పాటు సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలని సూచించింది. తుది అభ్యర్థుల జాబితా ప్రచురణను అక్టోబర్ 25 వరకు వాయిదా వేస్తూ, తదుపరి విచారణను అక్టోబర్ 26కు వాయిదా వేసింది.