వీరభద్రాపురం ఎంపీటీసీగా పువ్వాడివెంకటేశ్వర్లు నామినేషన్
పామూరు, మేజర్ న్యూస్ ; పామూరు మండల ఎంపీపీ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు బుధవారం వీరభద్రాపురం ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. మండలంలో పార్టీని ముందుండి నడిపిస్తూ కార్యకర్తలతో నిరంతరం మమేకమవుతున్న పువ్వాడి వెంకటేశ్వర్లును ఎంపీపీ అభ్యర్థిగా పార్టీ ఇప్పటికే ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో వీరభద్రాపురం ఎంపీటీసీ స్థానం నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మండలంలోని నాయకులు, కార్యకర్తలు ఆయనకు మద్దతుగా నిలిచారు.