BREAKING
పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనిది జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ కార్యక్రమంపై అవగాహన సదస్సు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణపై కసరత్తు! యువత చూపు తెలుగుదేశం పార్టీ వైపు- మైనార్జీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ దశాబ్దాల సమస్యకు తక్షణ పరిష్కారం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.. ఎంపీటీసీ బరిలో టీడీపీ అభ్యర్థి జంగం లావణ్య పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం- జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ. అద్దంకిలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్. పరిషత్ ఎన్నికలకు బందోబస్తు కావలిలో వైసీపీకి షాక్‌.. స్థానిక పోరు: తాడిమర్రిలో బోణీ కాని ఎంపీటీసీ నామినేషన్లు బాన్సువాడలో ఘనంగా రావణదహన కార్యక్రమం పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం – వారి సేవలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం తోటకూర వజ్రేష్ యాదవ్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన అలియాబాద్ కాంగ్రెస్ నేతలు వెబ్‌సైట్లను నిలిపివేయాల్సి రావచ్చని హెచ్చరించిన యూరోపియన్ ఏజెన్సీ

నంద్యాల మునిసిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా డాక్టర్ బాబన్ కు బీ-ఫామ్ అందజేసిన మంత్రి ఎన్‌ఎండి ఫరూక్

Select Suryaa Now
నంద్యాల మునిసిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా డాక్టర్ బాబన్ కు బీ-ఫామ్ అందజేసిన మంత్రి ఎన్‌ఎండి ఫరూక్

సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల మునిసిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున అధికారిక అభ్యర్థిగా డాక్టర్ బాబన్‌ను అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్‌ఎండి ఫరూక్ ఆయనకు అధికారికంగా ‘బీ-ఫామ్’ అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండే డాక్టర్ బాబన్ అభ్యర్థిత్వాన్ని కూటమి పెద్దలు ఆమోదించారని తెలిపారు. మునిసిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి సమన్వయంతో పనిచేసి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి డాక్టర్ బాబన్ ఘన విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తమపై నమ్మకంతో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ మరియు కూటమి నేతలకు డాక్టర్ బాబన్ కృతజ్ఞతలు తెలియజేశారు. నంద్యాల పట్టణ సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, కొట్టాల శివనాగిరెడ్డి, ప్రేమ్ నాథ్ రెడ్డి మరియు స్థానిక కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ బాబన్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*