వైసిపి కౌన్సిలర్ అభ్యర్థి సనపల భవ్య ప్రచారం
ఆమదాలవలస, నవంబర్ 20, మేజర్ న్యూస్ ఆమదాలవలస మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 19వ వార్డు వైసిపి కౌన్సిలర్ అభ్యర్థి సనపల భవ్య శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. వార్డు అభివృద్ధికి వైసీపీకి అవకాశం కల్పించాలని కోరారు. గత వైసిపి ప్రభుత్వంలో వార్డులో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి, అభివృద్ధి పథంలో నడిపించామని గుర్తు చేశారు. ఇంటింటా సంక్షేమాన్ని అందించిన ఘనత ఒక వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. ఈ ప్రచారంలో మాజీ కౌన్సిలర్ దుంపల శ్యామ్, వైసీపీ యువ నాయకులు సనపల మోహన సురేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.