BREAKING
తీపర్రు ఎంపీటీసీ కరటూరి సుబ్బారావుకు బూరుగుపల్లి శేషారావు అభినందనలు దివ్యాంగుల సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమం మృత్యువుకే ఎదురెళ్ళి గెలిచిన వీరనారీమణులు.. క్యాన్సర్‌ను జయించి స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్స్ సొంత పార్టీ ఎంపీ కార్యక్రమానికి వెళ్తే సస్పెండ్ చేస్తారా? ఏకపక్ష సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేయాలి జీబీఆర్‌లో క్రీడా సందడి.. విద్యార్థుల్లో ఉత్సాహం. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ నైజాం రైట్స్ సంచలనం.. రూ.35 కోట్ల భారీ డీల్‌ను దక్కించుకున్న ఏషియన్ సినిమాస్! కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి! బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ సూచనలు ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. నర్సరీ రైతు మార్గాని సత్యనారాయణకు యూనియన్ బ్యాంక్ పురస్కారం వారణాసి సినిమా ఓటీటీ రైట్స్ సంచలనం.. రూ.500 కోట్ల రికార్డు బిజినెస్‌పై టాలీవుడ్‌లో జోరుగా చర్చ! ఖైదీల సమస్యలు తెలుసుకున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎవరు..? ఆశావాహుల పేర్లు శాంతాడంత.... ఎమ్మెల్యే ఎవరికి ఓకే అంటే వారే అభ్యర్థి...

వైసీపీ నేతలపై వ్యతిరేక విమర్శలు సరికాదు.* *మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కి సూచించిన మాజీ మేయర్ మహమ్మద్ వసీం*

Select Suryaa Now
వైసీపీ నేతలపై వ్యతిరేక విమర్శలు సరికాదు.*  *మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కి సూచించిన మాజీ మేయర్ మహమ్మద్ వసీం*

అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ : ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన వైసీపీ నేతలపై వ్యతిరేక విమర్శలు చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కి  మాజీ మేయర్ మహమ్మద్ వసీం సూచించారు.జిల్లా వైసిపి కార్యాలయంలో బుధవారం మాజీ మేయర్ మహమ్మద్ వసీం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి,విశ్వేశ్వర రెడ్డి లపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.జేసీ ప్రభాకర్ రెడ్డి అంత రాజకీయ అనుభవం తమ వయసు లేదని,గతంలో ఆయన ప్రెస్ మీట్ లు పెడితే ఆసక్తిగా వినేవారమన్నారు.అయితే ఇటీవల కాలంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ లు పెడితే వ్యక్తిగత దూషణలు తప్పా మరేమీ ఉండటం లేదనే భావన మాతో పాటు అన్ని వర్గాలలో వ్యక్తమవుతోందన్నారుమాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి,విశ్వేశ్వర రెడ్డి లు ప్రజాస్వామ్య బద్ధంగానే ఎంపిలుగా,ఎమ్మెల్యేలుగా,మంత్రులుగా ఎంపిక అయ్యారన్నారు.40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్న అనంత వెంకటరామిరెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ,బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సరికాదని ఆయన సూచించారు.మొన్నటి ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరిగాయని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారని ప్రజాస్వామ్య బద్దంగా జరిగి ఉంటే ఇన్ని గొడవలు,రిగ్గింగ్ లు,సైక్లింగ్ లు,బూత్ క్యాప్చర్ లు జరిగి ఉండేవా అని ఆయన  ప్రశ్నించారు.అనంతపురం, గుంతకల్లు, కల్యాణ దుర్గం,తాడిపత్రి లలో ఏ విధంగా ఎన్నికలు జరిగాయో ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు.గతంలో వైసీపీ హయాంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగాయి కాబట్టే మీరు మున్సిపల్ చైర్మన్ అయ్యారు అని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. అదే విధంగా అనంత వెంకటరెడ్డి కానీ,అనంత వెంకటరామిరెడ్డి కానీ ప్రజాస్వామ్య బద్దంగానే ఎన్నికల్లో ఎంపిక అయ్యారన్నారు.40 ఏళ్లలో అనంత వెంకటరామిరెడ్డి నగరంలో కానీ,జిల్లాలో కానీ ఏమీ అభిరుద్ది చేశారో జిల్లా ప్రజలు అందరికీ తెలుసు అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగత దూషణలు మనీ హుందాగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని ఆయన సూచించారు.విలేకరుల సమావేశంలో మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు మొఘల్ సైఫుల్లా బేగ్, కార్పొరేటర్లు అనిల్ కుమార్ రెడ్డి, షేక్ ఖాజా , జ్ఞానేశ్వర్,సుకేష్,మాజీ కార్పొరేటర్లు రహంతుల్లా, ఇషాక్, కమల్ భూషణ్,నాయకులు ఖాజా,కిషోర్,మైనుద్దీన్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్.