వైసీపీ నేతల ఇంటింటా ప్రచారం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైసీపీ పార్టీ తరుపున ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ సీనియర్ నాయకులు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి సతీమణి ఇందుమతి తరపున వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య తదితరులు గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. చైర్మన్ అభ్యర్థి అల్లారెడ్డి ఇందుమతి,14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తెలదాల పద్మమ్మ ల ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ 14వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రచార కార్యక్రమం చేశారు. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య , వార్డు ఇన్ ఛార్జ్ చిల్లూరు రాకేష్, ఈదల ముసలయ్య, తెలదాల కొండయ్య, కల్పన, రవీంద్ర, దిలీప్, సాధక్, మరియు మహిళా నాయకులు సుమతి, పద్మమ్మ, భవాని, కళ్యాణి, జాస్మిన్, మాధురి, రమా, రహమతున్నిసా, మహమ్మద్ అలీ, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.