పెద్దాపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సదాశివపేట;పెద్దాపూర్ గ్రామంలో సర్పంచ్ మనీష బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను రంగురంగుల పూలతో అందంగా అలంకరించి, సంప్రదాయ పాటలు, ఆటలతో సంబరాలు జరుపుకున్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పెద్దాపూర్ గ్రామంలో ప్రత్యేక ఆనవాయితీతో నిర్వహించడం విశేషం. సాధారణంగా గ్రామాల్లో విజయదశమికి ముందు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుండగా, పెద్దాపూర్‌లో మాత్రం విజయదశమి తర్వాత బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం గత 200 సంవత్సరాలుగా ఆనవాయితీగా కొనసాగుతోందని గ్రామ సర్పంచ్ బాలరాజ్ గౌడ్ తెలిపారు.తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని గ్రామ ప్రజలు ఐకమత్యంతో కొనసాగించడం సంతోషంగా ఉందని, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, మహిళలు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రామ్ రెడ్డి, మాచిరెడ్డిపల్లి సర్పంచ్ మోహన్ గౌడ్ బ్లాక్ ప్రెసిడెంట్ చాట్ల సిద్ధన్న పెద్దాపూర్ ఉప సర్పంచ్ సందీప్ మహిళలు గ్రామస్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.