మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల వెంకటేష్
ఆమనగల్లు రంగారెడ్డి: ;దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ గురువారం బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గ రాజకీయాలను అడిగి తెలుసుకున్న ఆయన ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలతో కలిసి ఉద్యమించాలని, పార్టీ మరింత పటిష్టత కోసం కృషి చేయాలని సూచించినట్లు చెప్పారు. నాయకులు ఓరుగంటి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్,