బాధితుడికి బంగారు గొలుసు అప్పగింత
జిన్నారం;బొల్లారం డివిజన్ పరిధిలోని వై ఎస్ ఆర్ కాలనీలో ఈ నెల 19వ తేదీన అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర జరుగుతుండగా యువకులు రంగులు చల్లుకునే క్రమంలో శివ బంగారు గొలుసు పోగొట్టుకున్నాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు పోలీసులు స్థానికంగా సీసీ కెమెరాల ఫుటేజీని విచారించగా ఓ బాలుడికి బంగారు గొలుసు దొరికినట్లుగా నిర్ధారించుకున్నారు. ఈ మేరకు గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ ఓ వి.సుధీర్ కుమార్ సేకరించిన బంగారు గొలుసును బాధితుడికి అప్పగించారు. దీంతో బాధితుడు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.