BREAKING
కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్!

వైసీపీ నెల్లూరు జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బొమ్మిరెడ్డి -అధినేత హామీ

Select Suryaa Now
వైసీపీ నెల్లూరు జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బొమ్మిరెడ్డి -అధినేత హామీ

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   ఆత్మకూరు కి చెందిన వైసిపి నాయకుడు,మాజీ శాసన మండలి సభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ తరఫున పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారంటూ ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైసీపీ ఇన్చార్జ్ మేకపాటి విక్రం రెడ్డి తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు.గురువారమే మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని  మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాలు అందజేసిన విషయం పాఠకులకు విధితమే.ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి రాఘవేంద్ర రెడ్డికి సూచించినట్లు తెలిసింది. కాగా శుక్రవారం ఆత్మకూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో  నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ వైసీపీ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారంటూ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ అయితే రాఘవేంద్ర రెడ్డి అభ్యర్థి కావడం ఖరారైనట్లుగా భావిస్తున్నారు. రాఘవేంద్ర రెడ్డి బిల్డర్ గా చెన్నైలో ఉంటున్నారు.ఆయన రాజకీయ కుటుంబానికి చెందినవారు. ఆయన తండ్రి డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంనుండి మూడు దపాలు శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు.ఆయన సోదరుడు డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి  ఐదేళ్లపాటు ఆత్మకూరు మండల అధ్యక్షుడుగా, మరో అయిదు సంవత్సరాలు ఆత్మకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ గా వ్యవహరించారు. రాఘవేందర్ రెడ్డి 2009లో రాజకీయ ఆరంగేట్రం చేసి కాంగ్రెసులో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి హామీతో ఏఎస్పేట జడ్పిటిసి మెంబర్గా పోటీ చేసి గెలుపొందారు. వివిధ పరిణామలతో ఆయనకు చైర్మన్ పదవి దక్కలేదు.  వెంటనే వచ్చిన స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో ఇండిపెండెంట్గా రాఘవేంద్ర రెడ్డి పోటీ చేసి విజయం సాధించి మూడేళ్ల పాటు శాసనమండలి సభ్యులుగా కొనసాగారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా ఆత్మకూరు మండలంలో జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి అధిరోహించారు. అప్పట్లో ఆయన వెంకటగిరి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా కూడా వ్యవహరించేవారు. కాగా పార్టీలో వ్యవహారశీలి నచ్చలేదంటూ 2019లో ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరి 2023 వరకు కొనసాగి ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీలో చేరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం కోసం ఆయన విశేషంగా కృషి చేశాడు. తాజాగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ అయితే బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని పోటీ చేసేలా ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. రాఘవేంద్ర రెడ్డి స్వయంగా ఆత్మకూరు పట్టణంలో కొలగాని సత్రం ఆవరణలో దాదాపు రెండు కోట్ల రూపాయల సొంత వ్యయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి వ్యవస్థాపక ధర్మకర్తగా కొనసాగుతున్నారు. రాజకీయ కుటుంబానికి చెందిన గతంలో శాసనమండల సభ్యులుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా వ్యవహరించిన రాఘవేందర్ రెడ్డి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ అయితే జడ్పీ చైర్మన్ అభ్యర్థి అభ్యర్థి అన్న సమాచారంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి.