BREAKING
ఘనంగా విజయదశమి వేడుకలు రేపల్లె జెడ్పీటీసీ బరిలో బీజేపీ అభ్యర్థి జుజ్జవరపు సురేష్‌ ఆత్మకూరులో పోలీస్ కవాతు అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి.. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఒకే కుటుంబంలో 26 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు.. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు హక్కు పొందాలి: బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభ ప్రద్ పటేల్ ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు భారీ పోలీస్ బందోబస్తు ప్రధాని మోదీ సమక్షంలో కళా ప్రదర్శనకు అవకాశం బాపట్లలో ‘ఫ్రెండ్లీ ఎలక్షన్స్‌’పై జనసేన దృష్టి! ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి సీఏఆర్‌లో మెగా రక్తదాన శిబిరం.. స్వయంగా రక్తదానం చేసిన సీపీ బి. సుమతి దలేర్ మెహందీకి మద్దతుగా నిలిచిన అనుపమ్ ఖేర్.. వేదికపై గాయకుడిని పబ్లిక్‌గా నిలదీయడం తగదంటూ వ్యాఖ్యలు! మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అభ్యర్థుల జాబితా ప్రకటన ఈనెల 25 వరకు వాయిదా! తాళ్లపేటలో దాడి.. ముగ్గురికి గాయాలు నంద్యాల మునిసిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా డాక్టర్ బాబన్ కు బీ-ఫామ్ అందజేసిన మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ 2 ముగింపు.. 450 ఎపిసోడ్ల తర్వాత భావోద్వేగంగా వీడ్కోలు పలికిన ఏక్తా కపూర్!

వైఎస్సార్‌సీపీ ZPTC అభ్యర్థి భర్త లక్ష్మారెడ్డిపై దాడి

Select Suryaa Now
 వైఎస్సార్‌సీపీ ZPTC అభ్యర్థి భర్త లక్ష్మారెడ్డిపై  దాడి

నరసరావుపేట/పిడుగురాళ్ల:పల్నాడు జిల్లాలో ఎన్నికల వేడి ఒక్కసారిగా రగిలింది. పిడుగురాళ్ల వైఎస్సార్‌సీపీ జెడ్‌పిటిసి అభ్యర్థి భారతి భర్త లక్ష్మారెడ్డిపై ప్రత్యర్థులు దారుణ దాడికి తెగబడ్డారు. నరసరావుపేట ఆర్‌డీవో (RDO) కార్యాలయం వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

నామినేషన్ల ప్రక్రియలో భాగంగా లక్ష్మారెడ్డి ఆర్‌డీవో కార్యాలయానికి చేరుకోగా, ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడటంతో అక్కడున్న వారంతా తీవ్ర తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో లక్ష్మారెడ్డికి తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే స్పందించిన స్థానికులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆయనను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఆర్‌డీవో ఆఫీస్ సమీపంలోనే ఈ దాడి జరగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.