వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించండి. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు.
వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించండి.
మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు.
రొంపిచెర్ల, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని మాజీ మంత్రి, పుంగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆయన బుధవారం రొంపిచెర్ల మండలంలోని గానుగచింత గ్రామపంచాయతీలో ఎన్నికల ప్రచారం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సూపర్ సిక్స్, 50 సంవత్సరాలకు బీసీలకు పెన్షన్, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల పైన అవుతున్న ఇంతవరకు హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని సూచించారు. రొంపిచెర్ల మండల జెడ్పీటీసీ కోటా సుష్మ ను అఖండ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. గానుగ చింత దాసరిగూడెం లో మాజీ మంత్రిని మహిళలు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చిచ్చిలి పురుషోత్తం రెడ్డి, చిచ్చిలి రెడ్డీశ్వర్ రెడ్డి, విజయ్ శేఖర్, కోటా వెంకటరమణ, డాక్టర్ శ్రీనాథ్, రామకృష్ణ నాయుడు, సురేంద్ర నాయుడు, సూర్య నారాయణ రెడ్డి, అల్లాబక్షు, మహబూబ్ బాషా, బావాజీ సాహెబ్, కుమార్ నాయుడు, ఓబులేసు, సూర్యనారాయణ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, హరిక్రిష్ణా రెడ్డి యర్రం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.