BREAKING
ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి.. డీఎస్పీ రవిబాబు.. ఘనంగా దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు. 8వ వార్డులో జనసేన అభ్యర్థి ఎస్. మురధు విస్తృత ప్రచారం అనుమతులు జీ ప్లస్‌ 2.. నిర్మాణాలు జీ ప్లస్‌ 3,లేదా జీ ప్లస్ 4. ఐరోపా మార్కెట్లపై కేంద్ర బ్యాంకుల ప్రభావం...ఈసీబీ భవిష్యత్తు మరియు ఆర్థిక సవాళ్లు చలో ఢిల్లీకి రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ దండు..జెండా ఊపి ప్రారంభించిన సంగీతం శ్రీనివాస్ స్పానిష్ దిగ్గజం కైక్సాబ్యాంక్ మూడో త్రైమాసిక నికర లాభంలో 22 శాతం వృద్ధి బ్రిటన్ ఇంధన రంగంలో కొత్త ఒప్పందాల జోరు ప్రజా ఆశీస్సులతో ఎన్నికల బరిలోకి.. రాళ్లగంగమ్మ ఆలయంలో పూజలతో ప్రచారానికి శ్రీకారం క్రిప్టో చరిత్రలో అతిపెద్ద భద్రతా వైఫల్యం...బినాన్స్ డేటా ఉల్లంఘన ప్రకంపనలు కొత్తపెళ్లి గ్రామంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి 75 ట్రాక్టర్ ట్రిప్పుల అక్రమ ఇసుక, నాలుగు డంపర్లు స్వాధీనం విమాన ఛార్జీల పెంపు, వ్యయ నియంత్రణ...స్టాక్ మార్కెట్లో ఎగబాకిన ఇండిగో షేర్లు భారత్ ట్రెండ్స్ షేర్లలో భారీ లాభాలు నమోదు శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం రష్యాపై వాగ్ధాటి తగ్గించాలని యూరప్ దేశాలకు పెంటగాన్ విజ్ఞప్తి

ఉప్పుమాగులూరు ఎంపీటీసీ నామినేషన్‌పై వివాదం టీడీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది: ప్రసాద్‌రెడ్డి ఆరోపణ

Select Suryaa Now
ఉప్పుమాగులూరు ఎంపీటీసీ నామినేషన్‌పై వివాదం  టీడీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది: ప్రసాద్‌రెడ్డి ఆరోపణ
బల్లికురవ మేజర్ న్యూస్: 
బల్లికురవ మండలం ఉప్పుమాగులూరు ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు వంతారి సుబ్బాయమ్మ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరిస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయంపై వివాదం నెలకొంది.నామినేషన్ తిరస్కరణపై ఆమె దాఖలు చేసిన అప్పీల్‌ను అద్దంకి రెవెన్యూ డివిజనల్ అధికారి కొట్టివేస్తూ ఈ నెల 26న ఉత్తర్వులు జారీ చేశారు.ఉప్పుమాగులూరుకు చెందిన వంతారి సుబ్బాయమ్మ ఈ నెల 21న ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.అయితే,నామినేషన్ పత్రంలో పేర్కొన్న భర్త పేరు,ఆధార్ కార్డు వివరాలు,ఓటరు జాబితాలోని వివరాల మధ్య వ్యత్యాసం ఉందనే కారణంతో రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు.దీనిపై సుబ్బాయమ్మ అద్దంకి ఆర్డీవోను ఆశ్రయిస్తూ ఈ నెల 25న అప్పీల్ దాఖలు చేశారు.తన ఆధార్ కార్డు,రేషన్ కార్డులో భర్త పేరు వెంకయ్యగా ఉండగా,ఓటరు జాబితాలో మంగయ్యగా నమోదైందని,ఆ రెండు పేర్లు ఒకే వ్యక్తిని సూచిస్తున్నాయని విచారణ సందర్భంగా ఆమె వివరించారు.తన నామినేషన్‌ను ఆమోదించి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు.అయితే,విచారణలో రిటర్నింగ్ అధికారి సమర్పించిన వివరణతో పాటు సంబంధిత రికార్డులను పరిశీలించిన ఆర్డీవో,నామినేషన్ తిరస్కరణ నిర్ణయాన్ని సమర్థిస్తూ అప్పీల్‌ను కొట్టివేశారు.ఈ వ్యవహారంపై స్పందించిన బాపట్ల జిల్లా వైసిపి ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రెడ్డి,టీడీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ సుబ్బాయమ్మ నామినేషన్‌ను తిరస్కరించేలా చర్యలు చేపట్టిందని ఆరోపించినట్లు పేర్కొన్నారు.ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని అడ్డుకునేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడినట్లు తెలిపారు.