కురబలకోట,మేజర్ న్యూస్ : మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ క్యాడెట్లు కార్పోరల్ జి.రుద్ర తేజ,కార్పోరల్ వై.సుచిత్ర,క్యాడెట్ సి.గిరీషలు తమిళనాడులోని తాంబరం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో 13 రోజులపాటు నిర్వహించిన అఖిల భారత వాయు సైనిక్ శిబిరం-2026ను విజయవంతంగా పూర్తి చేసినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 17 ఎన్‌సీసీ డైరెక్టరేట్లకు చెందిన 646 మంది క్యాడెట్లు ఈ శిబిరంలో పాల్గొనగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ డైరెక్టరేట్ల నుంచి 38 మంది క్యాడెట్లు,సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.ఈ జాతీయ స్థాయి శిబిరంలో మిట్స్ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు క్యాడెట్లు పాల్గొని శిక్షణను విజయవంతంగా పూర్తి చేయడం గర్వకారణమన్నారు.ఈ శిబిరంలో భాగంగా నిర్వహించిన వివిధ శిక్షణ కార్యక్రమాలు,పోటీల ద్వారా క్యాడెట్లు విమానయాన రంగానికి సంబంధించిన నైపుణ్యాలతోపాటు నాయకత్వ లక్షణాలు,క్రమశిక్షణ,బృందస్ఫూర్తి,సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం పొందారని తెలిపారు.ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం,బాధ్యతాయుతమైన ప్రవర్తన,సమన్వయం,నాయకత్వ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో ఎంతో ఉపయోగపడతాయన్నారు.ఎన్‌సీసీ శిక్షణ ద్వారా విద్యార్థులు దేశసేవ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవడంతో పాటు భవిష్యత్తులో రక్షణ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేసిన క్యాడెట్లను మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్.విజయభాస్కర్ చౌదరి,ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల,వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్,ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ కేర్‌టేకర్ ఆఫీసర్ డాక్టర్ చరణ్ కూచి తదితరులు అభినందించారు.
రిపోర్టర్ : కె. ఈశ్వర్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి