BREAKING
ఏపీలో మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు నోటీసులు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు యశోదమ్మకు ఘన నివాళి చైనా సోలార్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత...ఓవర్‌క్యాపాసిటీ సంక్షోభం గౌతమి స్కూల్ అధినేత బొల్లా శ్రీనివాసరావు ప్రతిపక్ష వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చిలీలోని ఎస్కొండిడా రాగి గనిలో సమ్మెకు దిగిన సూపర్వైజర్లు సైదాపురం పోలీస్ స్టేషన్లో నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్సై నాగమల్లేశ్వరరావు బ్యాంక్ ఆఫ్ అమెరికాపై 1.2 బిలియన్ డాలర్ల జరిమానా విధించిన అమెరికా ప్రభుత్వం ఉపాధిహామీ పై ప్రజావేదిక అపోలో ఆసుపత్రిలో ప్రత్యేక వెన్నెముక స్క్రీనింగ్ ప్యాకేజీ బుద్ధారంలో పోలీసుల ముమ్మర దాడులు-300 లీటర్ల బెల్లం పానకం, 20 లీటర్ల గుడుంబా స్వాధీనం దగ్ధం-32 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు భారతీయ మార్కెట్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఏఐ ప్రాక్సీ ట్రేడింగ్ రంగం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల విడుదలకు ముందు పుంజుకున్న సౌతాఫ్రికన్ రాండ్ ఇర్విన్ లో డిఎల్ఐ రిజర్వాయర్ రద్దుకై ఆందోళన ఉధృతం చేస్తాం ఉత్తర సముద్రంలో కొత్త చమురు మరియు గ్యాస్ నిల్వలను కనుగొన్న ఈక్వినార్ లాస్ ఏంజిల్స్‌లో ఎలక్ట్రిక్ టాక్సీ సేవలను ప్రారంభించిన జీఎస్ఎమ్

వార్డు కౌన్సిలర్లుగా స్థానికులకే అవకాశం కల్పించాలి

Select Suryaa Now
వార్డు కౌన్సిలర్లుగా స్థానికులకే అవకాశం కల్పించాలి

 

- స్థానికేతరుల పోటీపై ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి

 

- ఏబీసీ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి
మదనపల్లె,మేజర్ న్యూస్ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు పరిధిలో నివసిస్తూ,అక్కడే ఓటుహక్కు కలిగిన అభ్యర్థులకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని ఏబీసీ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి కోరారు.ఈ సందర్బంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానికేతరులు ఎన్నికల్లో పోటీచేసే అంశంపై ప్రజలు పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.స్థానిక వార్డు ప్రజలతో మమేకమై,వారి సమస్యలను,అవసరాలను క్షేత్ర స్థాయిలో తెలుసు కోవడంతోపాటు,ఆయా కుటుంబాల పరిస్థితులు,వార్డులోని అవసరాలపై స్థానిక అభ్యర్థులైతే మెరుగైన అవగాహన ఉంటుందని  గుర్తుచేశారు.అలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతోపాటు,వార్డు అభివృద్ధికి కృషి చేసే అవకాశం ఉంటుందన్నారు.వార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు,మౌలిక సదుపాయాల కల్పన,అర్హులకు పింఛన్లు,రేషన్ కార్డులు,సంక్షేమ పథకాలు సక్ర మంగా అందించడానికి,స్థానికంగా నివసించే అభ్యర్థులు క్షుణ్ణంగా అర్థం చేసుకోగలరని వివరించారు.స్థానిక అభ్యర్థులకు తమ వార్డులోని ప్రజల ఇబ్బందులు,అవసరాలపై స్పష్టమైన అవ గాహన ఉంటుందని తెలిపారు.రాజకీయ పార్టీలు స్థానికేతరులను ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రోత్సహించే విషయంలో పున రాలోచించాలని  అభిప్రాయపడ్డారు.అయితే,తాము స్థానికేతరుల పోటీకి పూర్తిగా వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూ,వార్డు అభివృద్ధి,ప్రజలతో నిరంతర సంబంధాలు,సమస్యల పరిష్కా రానికి ప్రాధాన్యతనిచ్చే అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరారు.ప్రజల మధ్య ఉంటూ,వారి అవసరాలను గుర్తించి,వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేసే స్టానిక నాయకులను ఎన్నుకునే విషయంలో ఓటర్లు ఆలోచనాత్మక నిర్ణయం తీసుకోవాలని డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి విజ్ఞప్తి చేశారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి