పండుగ వాతావరణంలో డాక్టర్ ఎన్.సేతు జన్మదిన వేడుకలు
- శుభాకాంక్షలు తెలిపిన పట్టణ ప్రముఖులు
మదనపల్లె,మేజర్ న్యూస్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,విజయభారతి విద్యాసంస్థ అధినేత డాక్టర్ ఎన్.సేతు జన్మదిన వేడుకలు మంగళవారం అట్టహాసంగా జరిగాయి.ఈ నేపథ్యంలో శ్రీ గుడ్విల్ కంప్యూటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో విఎస్ఆర్ గ్రాండ్ అధినేత సుధాకర్ రెడ్డి,ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా,విశ్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రఘునాథ్ రెడ్డి,శంకర్,ఎస్.బి రామమూర్తి శాలువా,పూలమాలతో సేతును ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ విద్య,సామాజిక సేవా,రాజకీయ రంగాలలో ఎన్.సేతు తనదైన ముద్రవేస్తున్నారన్నారు.33 సంవత్సరాల క్రితం విజయభారతి పాఠశాలను స్థాపించి మెరుగైన విద్యా ప్రమాణాలు పాటిస్తూ రాష్ట్రంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటిగా నిలిపారని కొనియాడారు.విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతోపాటు దేశభక్తి,సామాజిక స్పృహను పెంపొందించడంలో పాఠశాలను ముందు వరుసలో నిలుపుతున్నారని ప్రశంసించారు.అదేవిధంగా రాజకీయాలలోను తనదైన శైలిలో రాణిస్తున్నారని భారతీయ జనతా పార్టీ బలోపేతానికి విశేష కృషిచేస్తున్నారని,ఆయన సమర్ధతను గుర్తించి అధిష్టానం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు అప్పగించడం గర్వకారణమన్నారు.పదవుల కంటే సమాజ శ్రేయస్సే ముఖ్యమని భావించే డాక్టర్ ఎన్.సేతు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన ఆకాంక్షించారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి