BREAKING
ఏపీలో మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు నోటీసులు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు యశోదమ్మకు ఘన నివాళి చైనా సోలార్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత...ఓవర్‌క్యాపాసిటీ సంక్షోభం గౌతమి స్కూల్ అధినేత బొల్లా శ్రీనివాసరావు ప్రతిపక్ష వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చిలీలోని ఎస్కొండిడా రాగి గనిలో సమ్మెకు దిగిన సూపర్వైజర్లు సైదాపురం పోలీస్ స్టేషన్లో నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్సై నాగమల్లేశ్వరరావు బ్యాంక్ ఆఫ్ అమెరికాపై 1.2 బిలియన్ డాలర్ల జరిమానా విధించిన అమెరికా ప్రభుత్వం ఉపాధిహామీ పై ప్రజావేదిక అపోలో ఆసుపత్రిలో ప్రత్యేక వెన్నెముక స్క్రీనింగ్ ప్యాకేజీ బుద్ధారంలో పోలీసుల ముమ్మర దాడులు-300 లీటర్ల బెల్లం పానకం, 20 లీటర్ల గుడుంబా స్వాధీనం దగ్ధం-32 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు భారతీయ మార్కెట్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఏఐ ప్రాక్సీ ట్రేడింగ్ రంగం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల విడుదలకు ముందు పుంజుకున్న సౌతాఫ్రికన్ రాండ్ ఇర్విన్ లో డిఎల్ఐ రిజర్వాయర్ రద్దుకై ఆందోళన ఉధృతం చేస్తాం ఉత్తర సముద్రంలో కొత్త చమురు మరియు గ్యాస్ నిల్వలను కనుగొన్న ఈక్వినార్ లాస్ ఏంజిల్స్‌లో ఎలక్ట్రిక్ టాక్సీ సేవలను ప్రారంభించిన జీఎస్ఎమ్

కంబదూరు వైసీపీ సీనియర్ నాయకుడు నారప్ప మృతి పట్ల తలారి రంగయ్య సంతాపం

Select Suryaa Now
కంబదూరు వైసీపీ సీనియర్ నాయకుడు నారప్ప మృతి పట్ల తలారి రంగయ్య సంతాపం

కంబదూరు (కళ్యాణదుర్గం ఇంచార్జ్, మేజర్ న్యూస్) : కంబదూరు మండల కేంద్రానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు నారప్ప అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణవార్త పట్ల మాజీ పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

విషయం తెలిసిన వెంటనే కంబదూరులోని నారప్ప  నివాసానికి చేరుకున్న తలారి రంగయ్య.. ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి నారప్ప పార్టీ బలోపేతానికి చేసిన కృషిని, ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా రంగయ్య గుర్తుచేసుకున్నారు. నారప్ప మరణం పార్టీకి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.

అనంతరం, నారప్ప కుటుంబ సభ్యులను తలారి రంగయ్య పరామర్శించి, వారిని ఓదార్చారు. నారప్ప కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏ కష్టం వచ్చినా తోడుంటామని భరోసా ఇచ్చారు. నారప్ప ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని నారప్ప కి నివాళులర్పించారు.

 

రిపోర్టర్ : సుధా మోహన్, కళ్యాణదుర్గం ఇన్చార్జ్, కళ్యాణదుర్గం.