BREAKING
86 వార్డులకు నామినేషన్ల స్వీకరణకు 44 మంది రిటర్నింగ్ అధికారులు చెరువు కట్ట రహదారి అధ్వానం.. మరమ్మతులు ఎప్పుడు? జగ్గయ్యపేటలో త్వరలో ఎమర్జెన్సీ కేర్ క్లినిక్ ప్రారంభం! ఎమ్మెల్యే తాతయ్య చొరవతో 24/7 అత్యవసర వైద్య సేవలకు ముందడుగు అక్టోబర్ 25న ప్రారంభానికి సన్నాహాలు కలామ్ జీవితం ఆదర్శనీయం: వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ జాతీయ సరస్ మేళా-2026ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాలీవుడ్‌లో మాయమవుతున్న పిల్లల సినిమాలు.. 'తారే జమీన్ పర్' అందించిన పరిశ్రమలో ఏమైంది? ఎన్నికల ప్రవర్తన నియామవాళి పాటించని ఉద్యోగిపై చర్యలు స్థానిక సంస్థల ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు జిల్లా పోలీసుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు రేపు మహబూబ్నగర్లో సాహిత్య సందడి ఓటీటీలోకి తేజ సజ్జా 'ది ట్రైటర్స్ తెలుగు'.. మొదటి మూడు ఎపిసోడ్ల స్ట్రీమింగ్ టైమ్, పూర్తి వివరాలు ఇవే! ఘనంగా బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ సీమంతం వేడుక.. రష్మిక సాంగ్‌తో స్పెషల్ అట్రాక్షన్! ఓటీటీలోకి వచ్చిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎన్న విలై'.. తెలుగులోనూ స్ట్రీమింగ్! పుంగనూరు మునిసిఫల్ ఛైర్ పర్సన్ రేసులో సులోచన

అభివృద్ధి పనులకు బ్రేక్‌ పడనివ్వం అనంతపురం నగరంలో రూ.6.30 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం 12 ప్రాంతాల్లో ఒకేసారి పనులకు భూమి పూజ.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌

Select Suryaa Now
అభివృద్ధి పనులకు బ్రేక్‌ పడనివ్వం   అనంతపురం నగరంలో రూ.6.30 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం   12 ప్రాంతాల్లో ఒకేసారి పనులకు భూమి పూజ.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌

అనంతపురం (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : నగర అభివృద్ధి పనులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగనివ్వబోమని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ స్పష్టం చేశారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం నగరంలోని పీటీసీ మైదానం వద్ద రూ.6.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ దళవాయి రమాదేవితో కలిసి ఆయన భూమి పూజ చేశారు. 

మొత్తం 12 ప్రాంతాల్లో చేపట్టనున్న పనులకు ఒకే చోట శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ సహా వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రెండు దశాబ్దాల నాటి రోడ్డుకు కొత్త రూపు

భూమి పూజ అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ పీటీసీ మైదానం, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో గతంలో పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పీటీసీ మైదానం వద్ద సుమారు 20 నుంచి 22 ఏళ్ల క్రితం నిర్మించిన రహదారికి బదులుగా, అక్కడి నుంచి రాంనగర్‌ ఫ్లైఓవర్‌ వరకు నూతన రహదారిని నిర్మించనున్నట్లు వెల్లడించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని తెలిపారు.

రెండేళ్లలో రూ.1,300 కోట్లతో అభివృద్ధి, సంక్షేమం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం నగరంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. గత రెండేళ్లలో సుమారు రూ.1,300 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా దాదాపు రూ.300 కోట్లతో రహదారులు, మురుగునీటి కాలువలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులకు రూ.7 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు.

డంపింగ్‌ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం

నగరానికి దీర్ఘకాలంగా సమస్యగా మారిన డంపింగ్‌ యార్డులో పేరుకుపోయిన చెత్త తొలగింపు పనులు కొనసాగుతున్నాయని దగ్గుపాటి ప్రసాద్‌ తెలిపారు. సుమారు మూడు లక్షల టన్నుల చెత్తను తొలగించే ప్రక్రియలో ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయని, మరో రెండు నెలల్లో మిగిలిన చెత్తను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

చెత్త తొలగింపు పూర్తయిన అనంతరం అక్కడ రూ.17 కోట్ల వ్యయంతో ఆధునిక వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మిగిలిన స్థలంలో అందమైన పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.

ప్రణాళికాబద్ధంగా నగరాభివృద్ధి

అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. చేపట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి దశలవారీగా పరిష్కారాలు చూపిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని దగ్గుపాటి ప్రసాద్‌ స్పష్టం చేశారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.