BREAKING
ఎన్నికల వేళ పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి జిల్లా ఎస్పీ పి. జగదీష్‌ సంతమాగులూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఏ. బాలకృష్ణ సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్‌ఓసీలు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి నాలుగో రోజు దుర్గామాత పూజలు ఏపీలో మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు నోటీసులు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు యశోదమ్మకు ఘన నివాళి చైనా సోలార్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత...ఓవర్‌క్యాపాసిటీ సంక్షోభం గౌతమి స్కూల్ అధినేత బొల్లా శ్రీనివాసరావు ప్రతిపక్ష వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చిలీలోని ఎస్కొండిడా రాగి గనిలో సమ్మెకు దిగిన సూపర్వైజర్లు సైదాపురం పోలీస్ స్టేషన్లో నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్సై నాగమల్లేశ్వరరావు బ్యాంక్ ఆఫ్ అమెరికాపై 1.2 బిలియన్ డాలర్ల జరిమానా విధించిన అమెరికా ప్రభుత్వం ఉపాధిహామీ పై ప్రజావేదిక అపోలో ఆసుపత్రిలో ప్రత్యేక వెన్నెముక స్క్రీనింగ్ ప్యాకేజీ బుద్ధారంలో పోలీసుల ముమ్మర దాడులు-300 లీటర్ల బెల్లం పానకం, 20 లీటర్ల గుడుంబా స్వాధీనం దగ్ధం-32 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు భారతీయ మార్కెట్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఏఐ ప్రాక్సీ ట్రేడింగ్ రంగం

మహిళల సౌకర్యార్థం పింక్‌ టాయిలెట్‌ నిర్మాణానికి భూమి పూజ

Select Suryaa Now
మహిళల సౌకర్యార్థం పింక్‌ టాయిలెట్‌ నిర్మాణానికి భూమి పూజ

అనంతపురం (అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్) : మహిళలకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో అనంతపురం నగరంలో పింక్‌ టాయిలెట్‌ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, అహుడా చైర్మన్‌ టి.సి. వరుణ్‌, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవితో కలిసి జనసేన పార్టీ రాయలసీమ ప్రాంత మహిళా సమన్వయకర్త పెండ్యాల శ్రీలత పాల్గొన్నారు.

మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా నిర్మిస్తున్న పింక్‌ టాయిలెట్లు వారికి పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన పారిశుద్ధ్య వసతులు అందించడంలో ఉపయోగపడనున్నాయి. మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, గౌరవం, సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం నగరాభివృద్ధిలో భాగమని కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు.

మహిళలు బయటకు వెళ్లిన సమయంలో ఎదుర్కొనే పారిశుద్ధ్య సమస్యలను తగ్గించడంతో పాటు, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మహిళల సౌకర్యాలు, గౌరవం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నగరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.