BREAKING
86 వార్డులకు నామినేషన్ల స్వీకరణకు 44 మంది రిటర్నింగ్ అధికారులు చెరువు కట్ట రహదారి అధ్వానం.. మరమ్మతులు ఎప్పుడు? జగ్గయ్యపేటలో త్వరలో ఎమర్జెన్సీ కేర్ క్లినిక్ ప్రారంభం! ఎమ్మెల్యే తాతయ్య చొరవతో 24/7 అత్యవసర వైద్య సేవలకు ముందడుగు అక్టోబర్ 25న ప్రారంభానికి సన్నాహాలు కలామ్ జీవితం ఆదర్శనీయం: వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ జాతీయ సరస్ మేళా-2026ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాలీవుడ్‌లో మాయమవుతున్న పిల్లల సినిమాలు.. 'తారే జమీన్ పర్' అందించిన పరిశ్రమలో ఏమైంది? ఎన్నికల ప్రవర్తన నియామవాళి పాటించని ఉద్యోగిపై చర్యలు స్థానిక సంస్థల ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు జిల్లా పోలీసుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు రేపు మహబూబ్నగర్లో సాహిత్య సందడి ఓటీటీలోకి తేజ సజ్జా 'ది ట్రైటర్స్ తెలుగు'.. మొదటి మూడు ఎపిసోడ్ల స్ట్రీమింగ్ టైమ్, పూర్తి వివరాలు ఇవే! ఘనంగా బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ సీమంతం వేడుక.. రష్మిక సాంగ్‌తో స్పెషల్ అట్రాక్షన్! ఓటీటీలోకి వచ్చిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎన్న విలై'.. తెలుగులోనూ స్ట్రీమింగ్! పుంగనూరు మునిసిఫల్ ఛైర్ పర్సన్ రేసులో సులోచన

వీబీజీ రామ్ జీ పథకం కింద ఉపాధి కల్పించే శ్రామికుల సంఖ్యను పెంచాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

Select Suryaa Now
వీబీజీ రామ్ జీ పథకం కింద ఉపాధి కల్పించే శ్రామికుల సంఖ్యను పెంచాలి*  *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

 

కర్నూలు, అక్టోబర్ 14:- వీబీజీ రామ్ జీ పథకం కింద చేపట్టిన పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయడంతో పాటు, శ్రామికులకు విస్తృతంగా ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి డ్వామా పిడి ని ఆదేశించారు. 

బుధవారం గూడూరు మండలంలోని కె.నాగలాపురం గ్రామంలో జలధార - జలహారతి 2.0 కింద చేపడుతున్న నీటి సంరక్షణ   పనులను కలెక్టర్ పరిశీలించారు.

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  గ్రామంలోని అర్హులైన  శ్రామికులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.. గత వారం 80 నుంచి 90 మంది వరకు కూలీలు హాజరుకాగా, ప్రస్తుతం 110 మంది లక్ష్యానికి గాను 60 మంది మాత్రమే పనులకు వస్తున్నారని, శ్రామికులకు ఉపాధి హామీ పనుల ప్రాధాన్యతను వివరించి, పనులకు హాజరయ్యేలా అవగాహన కల్పించాలన్నారు...ప్రతి గ్రామంలో వీబీ జీ రామ్ జీ కింద శ్రామికులకు కచ్చితంగా  పని కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. 

 

అనంతరం శ్రామికులతో మాట్లాడుతూ   వారానికి ఎన్ని రోజులు పని లభిస్తోంది, వేతనాలు సక్రమంగా అందుతున్నాయా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.   అర్హులైన వారికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయా అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు లేని అర్హులైన పేద కుటుంబాలను గుర్తించి, వారికి గృహ నిర్మాణ పథకం కింద దరఖాస్తులు స్వీకరించేందుకు 3 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ హౌసింగ్ పిడి ని ఆదేశించారు. 

కార్యక్రమంలో డ్వామా పిడి నరసింహా రెడ్డి, డ్వామా ఎపిడి పద్మ,  తదితరులు పాల్గొన్నారు.