ఉచిత స్కూటీలు అందజేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
8 మంది లబ్ధిదారులకు ఉచిత స్కూటీలు అందజేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
*బొమ్మూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లబ్ధిదారులైన దివ్యాంగులకు ఉచిత త్రిచక్ర వాహనాలను (మోటరైజ్డ్ స్కూటీలను) రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పంపిణీ చేశారు. త్రిచక్ర వాహనాల (స్కూటీల) తాళాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్ళపై తాము నిలబడేందుకు, వారి నిత్య జీవితంలో ఆర్థిక మరియు సామాజిక పురోగతి సాధించేందుకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రతిజ్ఞాబద్ధంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగుడికి ప్రభుత్వ పథకాలు మరియు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
వాహనాలు అందుకన్న దివ్యాంగులు ఎమ్మెల్యే గారికి మరియు ప్రభుత్వానికి తమ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రతినిధులు, జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.