BREAKING
రైతుల సందేహాల నివృత్తికి రెజోనియా టోల్‌ఫ్రీ నంబర్ సీఎం సభను విజయవంతం చేయాలి బాక్సాఫీస్ వద్ద నాని 'ది ప్యారడైజ్' హవా.. రెండో రోజే భారీ వసూళ్లు! ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. : రేవంత్ రెడ్డి కంటపడింది.. సిరిసిల్ల ప్రజల పంట పండింది! నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబరు 2 నుంచి అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మిల రొమాంటిక్ 'లవ్' వెబ్ సిరీస్! జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి పోలీసులపై దాడులు ఉపేక్షించేది లేదు శ్రీశైలానికి హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద నీరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి తెలంగాణ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ ఫలితాలు విడుదల మల్లన్న సేవలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కర్నూలు విమానాశ్రయంలో పైలట్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం మల్లన్న సేవలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ సాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు

Select Suryaa Now
కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు

కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు* 

 

నగరపాలక కమిషనర్ రాహుల్ మీనా ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నగరంలోని రోడ్లు, ఫుట్‌ పాత్‌లపై ఆక్రమణలను పట్టణ ప్రణాళిక అధికారులు తొలగిస్తున్నారు. ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రసాద్ ఆదిత్య మాల్ పరిసర ప్రాంతాలు, గెయిల్ కార్యాలయం ఎదురు రోడ్డు నందలి ఆక్రమణలను శనివారం టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. అధికారుల సూచన మేరకు పలువురు స్వచ్ఛందంగానే వాటిని తొలగిస్తుండటంతో రహదారులు, ఫుట్ పాత్ లు విశాలంగా మారాయి. తొలగించిన ప్రాంతాలలో మరలా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రాహుల్ మీనా హెచ్చరించారు. ఆయా ప్రదేశాలు తిరిగి ఆక్రమణకు గురి కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు. వీధి విక్రయదారులు తోపుడుబండ్లపై లేదా ఇతర వాహనాలపై ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్తకం జరుపుకొని తిరిగి తమ ప్రాంతాలకు వాహనాలను తీసుకువెళ్లే విధంగా చూసుకోవాలని, ఒకే ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి శాశ్వత విక్రయాలు జరపడాన్ని సహించమని స్పష్టం చేశారు. పుష్కరాల సన్నద్ధతలో భాగంగా ఈ స్పెషల్ డ్రైవ్ ఇదేవిధంగా కొనసాగుతుందని.. కనుక ప్రజలు సహకరించాలని కోరారు.