రైతుల సందేహాల నివృత్తికి రెజోనియా టోల్‌ఫ్రీ నంబర్
రైతుల సందేహాల నివృత్తికి రెజోనియా టోల్‌ఫ్రీ నంబర్
అనంతపురం బ్యూరో , విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్ నిర్మాణానికి సంబంధించి రైతుల సందేహాలు, అపోహలను నివృత్తి చేసేందుకు రెజోనియా కంపెనీ ఏర్పాటు చేసిన 1800 309 4401 టోల్‌ఫ్రీ హాట్‌లైన్‌ను జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు మధ్యవర్తులు లేకుండా నేరుగా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడేందుకు హాట్‌లైన్ ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతపురం, రాయలసీమ ప్రాంతాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
రెజోనియా ప్రాజెక్టు హెడ్ గిరిప్రసాద్ మాట్లాడుతూ, కర్ణాటక నుంచి అనంతపురం మీదుగా కడప జిల్లా సీకే దిన్నె వరకు ట్రాన్స్‌మిషన్ లైన్ పనులు కొనసాగుతున్నాయని, సుమారు 40 వేల మంది రైతులకు ఈ హాట్‌లైన్ ఉపయోగపడుతుందని తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నంబర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.