andhrapradesh
శ్రీశైలానికి హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద నీరు
శ్రీశైలం జలాశయానికి హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ 215.8070 టీఎంసీలు. కాగా శనివారం ఉదయం 6 గంటలకు డ్యామ్ నీటిమట్టం 855.90 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 94.2380 టీఎంసీలుగా నమోదైంది. ఆంధ్ర, తెలంగాణ పరిధిలోని జల విద్యుత్ కేంద్రాల్లో ఎటువంటి విద్యుత్ ఉత్పత్తి చేపట్టలేదు.