BREAKING
41 మంది అంగన్వాడీ సహాయకులకు నియామక పత్రాలు రైతుల సందేహాల నివృత్తికి రెజోనియా టోల్‌ఫ్రీ నంబర్ సీఎం సభను విజయవంతం చేయాలి బాక్సాఫీస్ వద్ద నాని 'ది ప్యారడైజ్' హవా.. రెండో రోజే భారీ వసూళ్లు! ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. : రేవంత్ రెడ్డి కంటపడింది.. సిరిసిల్ల ప్రజల పంట పండింది! నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబరు 2 నుంచి అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మిల రొమాంటిక్ 'లవ్' వెబ్ సిరీస్! జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి పోలీసులపై దాడులు ఉపేక్షించేది లేదు శ్రీశైలానికి హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల వరద నీరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి తెలంగాణ ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల టెట్‌ ఫలితాలు విడుదల మల్లన్న సేవలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కర్నూలు విమానాశ్రయంలో పైలట్‌ శిక్షణ కేంద్రం ప్రారంభం మల్లన్న సేవలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ

పోషణతోనే బంగారు భవిష్యత్‌కు బాట

Select Suryaa Now
పోషణతోనే బంగారు భవిష్యత్‌కు బాట

పోషణతోనే బంగారు భవిష్యత్‌కు బాట

పోషణ మాసోత్సవంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దనరావు
పామూరు, సూర్య ప్రతినిధి :‌
పామూరు మండలంలోని బొట్లగూడూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం  పోషణ మాసోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దనరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనార్దనరావు మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో కీలకమని అన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన కల్పించడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. పోషణ మాసోత్సవం ద్వారా ప్రజల్లో పోషకాహారంపై మరింత అవగాహన పెంపొందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ యువ నాయకుడు కోటపాటి రాజా, గుర్రాల నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు ఉమ్మడిశెట్టి శ్రీను, విజయకుమార్‌చారి, స్వయంకృషి సేవా సంస్థ అధ్యక్షులు నాయబ్ రసూల్, పామూరు క్లస్టర్ అంగన్వాడీ సూపర్వైజర్ గోళ్ల పద్మజ, అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.